After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందికరమైన రోజు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రేమికులకు మాత్రం మంచి రోజు. సంతోషంగా ఉండటానికి చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. వత్తిడికి గురవుతారు. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు అదృష్టం మీద ఆధారపడి పనులు చేయకండి.. కష్టపడితేనే ఈరోజు విజయం సాధిస్తారు. ధనాన్ని అనవసరంగా ఖర్చులు చేస్తారు. ఆరోగ్యం కోసం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. కుటుంబంలో అందరితో సఖ్యతతో ముందుకుపోవాల్సిన రోజు. మిత్రులతో మీ మంచిచెడులను పంచుకోవడం మనఃశాంతి కలిగిస్తుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి. శ్రీ లక్ష్మీ నారాయణ ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని విషయాలతో చికాకులు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది. ప్రేమికుల మధ్య కొంత మాటపట్టింపులు ఉంటాయి. వైవాహిక జీవితంలో ఆసక్తికరమైన సంఘటలను జరిగే అవకాశం ఉంది. అనుకోని మార్పులు జరుగుతాయి. శ్రీ రామ తారక మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. కర్కాటక రాశి ఫలాలు : ఆర్థిక విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంపది. సాయంత్రం మీకు దూరపు ప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది. ప్రేమికులకు శుభకరమైన రోజు. ఇంట్లో అందరూ కలసి కొత్త పనిని ప్రారంభిస్తారు. విశ్రాంతి దొరుకుతుంది. ఒంటరిగా ఉండటానికి ఈరోజు ఇష్టపడుతారు. శ్రీ శక్తి గణపతి ఆరాధన చేయండి.
Today Horoscope July 24 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ధన సంబంధ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య సూచన కనిపిస్తుంది. అనవసర ఖర్చులు వస్తాయి. వైవాహిక జీవితంలో అనుకూలత కనిపిస్తుంది. ప్రేమ పారవశ్యంలో మునిగి తేలుతారు. సంతానం వల్ల సంతోషాన్ని పొందుతారు. విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి శుభఫలితాలు. శ్రీ గణపతి స్తోత్రం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు మీరు ధైర్యంగా పనులు చేయాల్సిన అవసరం ఉంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఇంట్లో సందడి వాతావరణం. అతిథి రాకతో సంతోషం కలుగుతుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. మీ తెలివితేటలతో ముందుకు పోతారు. విందులు, వినోదాలకు హాజరవుతారు.ఇష్టదేవతరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మానసిక సంతృప్తితో ఈరోజు గడుస్తుంది. ఆహార పదార్తాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాల్సిన రోజు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగుతాయి. ధైర్యంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఈరోజు సర్‌ప్రైజ్ కలిగించే వార్తలను వింటారు. దుర్గాదేవి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు సానుకూల ఫలితాలు సాధిస్తారు. అనుకోని అనారోగ్యం సమస్య కోసం ధనం ఖర్చు చేస్తారు. ధనలాభాలు వస్తాయి. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలను పొందుతారు. మీ సృజనాత్మకతకు ఈరోజు ప్రశంసలు అందుతాయి. వైవాహిక జీవితంలో ఆనందంగా గడిచిపోతుంది. లాభదాయకమైన రోజు. దుర్గాదేవిని దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : చక్కటి రోజు. అనారోగ్యం నుంచి బయటపడుతారు. ఖర్చులతో మీకు మానసకి ఆందోళన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి అందే మద్దతుతో ముందుకుపోతారు. మంచి ప్రయోజనాలు పొందుతారు. ప్రేమికులు విచిత్రమైన రోజు. ఈరోజు చాలా కాలంగా లభించని విశ్రాంతి దొరుకుతుంది. కొత్త అవకాశాలు, కొత్త అలవాట్లు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సానుకూలత కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు కొంత శ్రమించాల్సిన రోజు. సృజనాత్మకంగా ఆలోచించాల్సిన రోజు. అనవసర ఖర్చులు పెడుతారు. సమయాన్ని వృథా చేస్తారు. తర్వాత బాధపడుతారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం ఈరోజు బాగుంటుంది. వైవాహికంగా మిశ్రమంగా ఉంటుంది. సరదా, సంతోషం సాయంత్రం నుంచి లభిస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు భవిష్యత్ ప్లాన్‌లను సిద్ధం చేస్తారు. మధ్యవర్తిత్వం వహించకూడదు. ఇంట్లో సంతోషకర పరిస్థితి ఉంటుంది. పనులు నిదానంగా ముందుకుపోతాయి. ముఖ్య వ్యక్తులను కలువబోతున్నారు. హార్ట్ టచింగ్ సంఘటన జరిగే అవకాశం ఉంది. కొన్ని పనులలో జరిగే జాప్యంతో మీరు నిరుత్సాహంగా ఉంటారు. వైవాహికంగా సంతోషకరమైన రోజు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : వివాదాలకు అవకాశం ఉంది. అనుకోని చికాకులు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థికంగా మందగమన స్తితి ఏర్పడుతుంది ఈరోజు. విందులు, వినోదాలకు హాజరవుతారు. శత్రువులతో కూడా విబేధాలు మాని ముందుకుపోవాల్సిన రోజు. సాయంత్రం నుంచి పరిస్తితి మారుతుంది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. అన్నింటా సానుకూలత పెరుగుతుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
This website uses cookies.