Zodiac Signs : మార్చి 06 ఆదివారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Zodiac Signs మేషరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు. వ్యయ ప్రయాసలతో కూడిన రోజు. ధన సంబంధ విషయాలలో జాగ్రత్తలు అవసరం. రుణాల కోసం ప్రయత్నిస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి ఈరోజు శ్రమాధిక్యం. మహిళలకు అనుకోని చికాకులు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. మంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. కుటుంబంలో సంతోష వాతావరణం. విద్యార్థులు అనుకన్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు ఆర్థిక లాభాలు. దుర్గాదేవి దగ్గర ఎర్రవత్తులతో దీపారాధన చేయండి.
Zodiac Signs మిథున రాశి ఫలాలు : ఆనందకరమైన రోజు. అప్పుల బాధల నుంచి విముక్తి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు మీకు లాభాలను తెస్తాయి. ధనలాభాలు కనిపిస్తున్నాయి. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. మహిళలకు వస్త్రలాభం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ప్రతికూల ఫలితాలు వస్తాయి. ధన సంబంధ విషయాలలో జాగ్రత్త. వ్యాపార లావాదేవీలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ బాధలు. అనవసర విషయాలతో వివాదాలు. మహిళలకు పని వత్తిడి పెరుగుతుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
సింహ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది ఈరోజు. అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఇంటా, బయటా అనుకోని చికాకులు, పని వత్తిడి పెరుగుతుంది. మహిళలకు బాధాకరమైన రోజు. శ్రీశివాభిషేకం చేయండి.
Zodiac Signs కన్య రాశి ఫలాలు : విజయపరంపర కొనసాగిస్తారు. ఆనందంగా మిత్రులతో గడుపుతారు. మెడికల్, కిరాణ వ్యాపారులకు లాభదాయకమైన రోజు. అనుకోని లాభాలు వస్తాయి. విహార యాత్రలకు ప్లాన్ చేయడం లేదా వెళ్లడం చేస్తారు. పెద్దల నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఇష్టదేవతారాధన చేయండి.
Zodiac Signs తులారాశి ఫలాలు : కొత్త అవకాశాలు వస్తాయి. అప్పుల బాధల నుంచి విముక్తి. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చాలా కాలంగా ఉన్న చికాకుల నుంచి బయటపడుతారు. అతిథి రాకతో సందడి. మహిళలకు ధనలాభ సూచన. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ధన సంబంధ విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉండండి. అనారోగ్య సూచన కనిపిస్తుంది. మహిళలకు చక్కటి ఫలితాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : అనుకోని చికాకులతో ఇబ్బందులు. ప్రయాణాలు చేసి ఇబ్బందులు పడుతారు. కుటుంబంలో సమస్యలు వస్తాయి. పెద్దల నుంచి ప్రయోజనాలు పొందుతారు. మిత్రులతో అనవసర వివాదాలు. మహిళలకు విశ్రాంతి లేకుండా ఉండే రోజు. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
Zodiac Signs మకరరాశి ఫలాలు : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు పరీక్షల్లో విజయం. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఉత్సాహంగా మహిళలు పనులు పూర్తిచేస్తారు. అమ్మవారి ఆరాధన చేయండి.
Zodiac Signs కుంభ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. కార్యాలయాల్లో పనిభారం పెరుగుతుంది. ఇష్టమైనవారి నుంచి చెడు వార్తలు వింటారు. అనవసర ఖర్చులు పెడుతారు. మహిళలకు ఆర్తిక ఇబ్బందులు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
Zodiac Signs మీనరాశి ఫలాలు : చక్కటి ఆర్థిక పరిస్థితితో సంతోషం. కుటుంబంలో సానుకూల మార్పులు. పనులను వేగంగా పూర్తిచేస్తారు. ధనలాభాలు, వ్యాపారులకు చక్కటి ఫలితాలు. ప్రయాణంతో ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు వస్త్ర లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.