Indiramma Houses : గుడ్‌న్యూస్‌.. ఇల్లు లేని వారికి 72 గజాల స్థలం… ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీల‌క అప్‌డేట్‌! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Indiramma Houses : గుడ్‌న్యూస్‌.. ఇల్లు లేని వారికి 72 గజాల స్థలం… ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీల‌క అప్‌డేట్‌!

 Authored By ramu | The Telugu News | Updated on :26 January 2026,8:40 pm

ప్రధానాంశాలు:

  •  Indiramma Houses : గుడ్‌న్యూస్‌.. ఇల్లు లేని వారికి 72 గజాల స్థలం… ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం స్పీడ్‌అప్!

Indiramma Houses :  పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మరింత ఊపునిస్తోంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుండగా, ఇప్పుడు పట్టణ పేదలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.రానున్న మూడు నెలల్లో దాదాపు లక్ష ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ నాటికి మొదటి విడత ఇళ్లను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో పట్టణాల్లో నివసిస్తూ సొంత భూమి లేని నిరుపేదలకు ఊరటనిచ్చే ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Indiramma Houses గుడ్‌న్యూస్‌ ఇల్లు లేని వారికి 72 గజాల స్థలం ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీల‌క అప్‌డేట్‌

Indiramma Houses : గుడ్‌న్యూస్‌.. ఇల్లు లేని వారికి 72 గజాల స్థలం… ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీల‌క అప్‌డేట్‌!

Indiramma Houses తెలంగాణ వాసులకు శుభవార్త..

పట్టణ ప్రాంతాల్లో నివాస స్థలం లేని అర్హులైన పేదలకు ఒక్కొక్కరికి 72 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారని చెప్పారు. అయితే ఈ స్థలాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తారా? లేక కేవలం స్థలాల కేటాయింపుకే పరిమితమవుతారా? అనే అంశంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.మహబూబాబాద్ జిల్లా మరిపె డ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రైతులకు రైతు భరోసా, బోనస్‌తో పాటు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నామని చెప్పారు.

జిల్లావ్యాప్తంగా రూ. 3.16 కోట్ల విలువైన పనిముట్లు రైతులకు అందించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు.ఇక ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3.49 లక్షల ఇళ్లకు అనుమతి లభించింది. అందులో మూడు నెలల్లో లక్ష ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన 2.49 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని జూన్ లేదా జూలై నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా పునాది దశలో ఉన్న లేదా ప్రారంభం కాని ఇళ్ల వివరాలను సేకరించి, సంబంధిత ఎమ్మెల్యేలకు జాబితాలు అందించనున్నారు.మొత్తంగా గ్రామీణంతో పాటు పట్టణ పేదలకు కూడా నివాస భద్రత కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుండటం విశేషం. ఇల్లు లేని కుటుంబాలకు ఈ నిర్ణయాలు ఎంతవరకు లాభం చేకూరుస్తాయో చూడాల్సి ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది