Zodiac Signs : సెప్టెంబర్ 12 సోమ‌వారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : సెప్టెంబర్ 12 సోమ‌వారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By aruna | The Telugu News | Updated on :11 September 2022,10:40 pm

మేష రాశి : ఆరోగ్యం చక్కగా ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. పనులలో పురోగతి. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. పిల్లల చదువు విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేసుకోండి. వృషభ రాశి : ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు. భాగస్వామితో చిన్నచిన్న ఇబ్బందులు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధున రాశి : అప్పుల బాధలు పెరిగిపోతాయి. ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. దుర్గా దేవి ఆరాధన చేసుకోండి. కర్కాటక రాశి : ఈరోజు మొండి బకాయిలను వసూలు చేసుకుని ధన లాభం పొందుతారు. పిల్లల చదువు విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు. మానసికంగా ప్రశాంతతగా ఉంటారు. శ్రీశివ పంచాక్షరీ జపం చేసుకోండి.

Today Horoscope September 12 2022 Check Your Zodiac Signs

Today Horoscope September 12 2022 Check Your Zodiac Signs

సింహరాశి : వివాహ నిశ్చయ తాంబూలాలకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులుకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కన్యారాశి : అప్పుల బాధలు తీరిపోతాయి. అనారోగ్యం తగ్గిపోతుంది. గృహ స్థలాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వైవాహికంగా బాగుంటుంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు. కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి : ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చిక రాశి : ఉద్యోగస్తులకు పని వత్తిడి. ఈరోజు భాగస్వామితో ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు. శివపంచాక్షరీ జపం చేయండి.

ధనస్సు రాశి : విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపార పురోగతి వృద్ధి చెంది లాభాలు కలుగుతాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. శ్రీశివ అష్టోతరం పారాయణం చేయండి.

మకర రాశి : ఈరోజు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, డబ్బును తిరిగి పొందుతారు. ఉన్నత చదువులకు ఉత్తీర్ణులు అవుతారు. పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి.

కుంభరాశి : కుటుంబ సభ్యులతో వివాదాలు. పిల్లల చదువు విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆర్థికంగా బాగుంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

మీన రాశి : ఈరోజు సానుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారస్థులకు లాభాలు. అప్పుల బాధలు తగ్గిపోతాయి. ఆనందంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది