Zodiac Signs : సెప్టెంబర్ 21 బుధవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు : కొద్దిగా చికాకులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అనుకోని ఇబ్బందులు. కుటుంబంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు మాత్రం సఫలం అవుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు రావచ్చు. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. శ్రీ దుర్గాదేవి స్తోత్రం పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : పర్వాలేదు అన్నవిధంగా ఉంటుంది ఈరోజు. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. అనవసర వివాదాలు వస్తాయి. అనుకోని ఖర్యుచలు రావచ్చు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఉపాది, వృత్తుల వారికి ఇబ్బందులు. నవగ్రహారాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : ఈరోజు మంచి ఫలితాలను అందుకుంటారు. చాలా కాలంగా వసూలు కాని బాకీలు వసూలు అవుతాయి. ఈ రోజు ఎవరికి అప్పులు ఇవ్వవద్దు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. వ్యాపరాలలో నష్టాలు రావు. స్వల్ప లాభాలు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : శుభవార్తలు అందే అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి బంధువుల లేదా మిత్రులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం. వివాదాలు పరిష్కారం. అప్పులు తీరుస్తారు. అన్నింటా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
సింహరాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. శుభవార్తలు అందుతాయి. వివాహప్రయత్నాలు సఫలం కావు. ఆనవసర ఖర్చులు వస్తాయి. పనులలో జాప్యం పెరుగుతుంది. విద్యా, ఉపాధి విషయాలలో పెద్దల సలహాలు తీసుకోకపోతే నష్టం. శ్రీ కాలభైరావాష్టకం వినడం/పారాయణం చేయండి.
కన్యరాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా వాటిని ధైర్యంతో అధిగమిస్తారు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయ వనరులు కొత్తవి వెతుకుతారు. మహిళలకు శుభసూచన. శ్రీ సుబ్రమణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి. మీరు అనవసర విషయాలలో తలదూర్చకండి. ఇంటా, బయటా శ్రమతో కూడిన రోజు. కొంచెం ఓపిక అవసరం. అరోగ్యం జాగ్రత్త. విద్యా, ఉపాధి, వృత్తుల విషయంలో కూడా కొంత ప్రతికూలత కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : సాధారణంగా ఉంటుంది ఈరోజు. అనుకోని ఖర్చులు వస్తాయి. మీ సృజనాత్మకతకు, తెలివితేటలకు పరీక్షగా ఉంటుంది. ఆదాయం కోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు కానీ పర్వాలేదు అనేలా ఉంటుంది. మానసిక ఆందోళన, ఆత్రుత. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
ధనస్సురాశి ఫలాలు : అనుకోని విధంగా ఈరోజు గడిచిపోతుంది. అనుకోని వారి కలయిక మీకు సంతోషం కలిగిస్తుంది. ఆర్థికంగా మాత్రం ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలలో ఉమ్మడి వ్యాపారాలు పర్వాలేదు. లాభాలు రావు. అనవసర తిరుగుడు. ప్రశాంతత లోపిస్తుంది. గణపతిని గరికతో ఆరాధించండి.
మకరరాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆర్థికంగా చిన్నచిన్న ఇబ్బందులు. ఆదాయం తగ్గుతుంది. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణ సూచన. కనిపించని శత్రువుల ద్వారా ఇబ్బందులు. శ్రీ శక్తి గణపతి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : అనుకోని శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంతం నుంచి మిత్రులు సందేశం లేదా విలువైన బహుమతులు పంపుతారు. పనులు వేగంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషం. మాటల ద్వారా ప్రేమ మరింత పెరుగుతుంది. విలువైన వస్తువులు కొంటారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది. తెలివిగా వ్యవహరించాల్సిన రోజు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో నిరాశజనకంగా ఉంటుంది. మంచి చేద్దామన్నా మీకు ఇబ్బంది వస్తుంది. అనవసర ఖర్చులు, శ్రమ భారం పెరుగుతుంది. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.