Zodiac Signs : సెప్టెంబర్ 28 బుధవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు : అనుకోని విధంగా లాభాలు వస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు ఊపందుకుంటాయి. విలువైన వస్తువులను కొంటారు. ఆదాయం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలలో అనుకూలత కనిపిస్తుంది. మహిళలకు మంచి లాభాలు. శ్రీ లక్ష్మీ అష్టోతరం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : కుటుంబంలో సానుకూల మార్పులు. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. అమ్మ తరపు వారినుంచి శుభవార్తలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు పనిభారం. శ్రీ దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.
మిథున రాశి ఫలాలు : ఆస్తి సంబంధ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. అన్నదమ్ముల నుంచి సహయం అందుతాయి. కుటుంబంలో చక్కటి శుభవాతావరణం. అనుకోని ప్రయాణాలు చేస్తారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. అనుకోని నష్టాలు వస్తాయి. బంధువుల నుంచి వత్తిడి. వ్యాపారాలలో అనుకోని నష్టాలు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. స్నేహితలు ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
సింహ రాశి ఫలాలు : ఆదాయం కోసం కొత్త కొత్త మార్గాలను ఆన్వేషిస్తారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. విద్యార్థులకు సదావకాశాలు లభిస్తాయి. పాత రుణాలు తీరుస్తారు. గోసేవ చేయండి.
కన్యరాశి ఫలాలు : అన్నింటా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలు పొందుతారు. ఇష్టదేవతరాధన చేయండి.
తులారాశి ఫలాలు : కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. వ్యసనాలు ద్వారా నష్టపోతారు. భార్య తరపు వారి నుంచి అనుకోని సమస్యలు రావచ్చు. మహిళలకు పని భారం. నవగ్రహారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : పనులలో వేగం పెరుగుతుంది. సానుకూలమైన వాతావరణంలో గడుస్తుంది ఈరోజు. మంచి వార్తలు వింటారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ కార్యాలలో పాల్గొంటారు. దుర్తా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : అన్ని రంగాల వారికి ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది. అనుకోని వారి నుంచి లాభాలు కలుగుతాయి. మధ్యవర్తిత్వం వహించకండి. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజ సేవ లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. గణపతి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : కొద్దిగా కష్టపడాల్సి రోజు. అనుకోని ఇబ్బందులు. ఆర్థిక మందగమనం.
వ్యాపారాల్లో నష్టాలుకుటుంబంలో అనిశ్చిత పరిస్థితులు.విద్యా, ఉద్యోగ విషయాలలో కొద్దిగా చికాకులు. ప్రయాణ చికాకుల వస్తాయి. అమ్మవారిని ఆరాధన చేయండి శుభం కలుగుతుంది.
కుంభ రాశి ఫలాలు : అన్నింటా అనుకూలత కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు అన్ని రకాల వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రయాణాలు లాభదాయకం. అనుకోని ప్రయోజనాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : కొంచెం కష్టం, కొంచెం నష్టం విధంగా ఉంటుంది ఈరోజు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు. సమస్యలను అధిగమిస్తారు. మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. అదాయం పెరుగుతుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.