Hyderabad : డాక్టర్ అవ్వాలని హైదరాబాద్ వెళ్ళిన యువతీ .. చివరికి ఇలా వ్యభిచారిగా ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyderabad : డాక్టర్ అవ్వాలని హైదరాబాద్ వెళ్ళిన యువతీ .. చివరికి ఇలా వ్యభిచారిగా ..??

 Authored By aruna | The Telugu News | Updated on :28 June 2023,6:00 pm

Hyderabad : ఇప్పుడు చాలా చోట్ల యువకులను టార్గెట్ చేసుకొని కొందరు డ్రగ్స్, సెక్స్ రాకెట్ లను యధేచ్చగా కొనసాగిస్తున్నారు. సీక్రెట్ గా తమ దందాలను నడిపిస్తున్నారు. ఈ క్రమంలోని పోలీసులకు చిక్కుతున్నారు అయినా కానీ వాటిని వదలడం లేదు. అయితే ఇప్పుడు ఆ కోవకు చెందిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. భద్రాచలం పట్టణానికి చెందిన శృతి అనే మిడిల్ క్లాస్ అమ్మాయికి చిన్నప్పటినుంచి డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది. శృతి బాగా చదివి ఉక్రేయిన్ లో మెడిసిన్ సీటు సంపాదించింది.

మెడిసిన్ లో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. రెండవ సంవత్సరం ఫీజు కట్టలేక ఉక్రెయిన్ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చింది. అలా కొన్ని రోజులు ఊర్లోనే ఉండి తర్వాత హైదరాబాద్ కు వచ్చింది. బంజారాహిల్స్ లోని ఫై స్టార్ హోటల్లో రిసెప్షనిష్ట్ గా చేరింది. వచ్చిన శాలరీ సరిపోకపోవడంతో తప్పుడు ఆలోచనలు చేసింది. ఈ క్రమంలోనే ఓ మసాజ్ సెంటర్ తెరిచి వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వారితో వ్యభిచారం చేయించి విపరీతంగా డబ్బు సంపాదించింది. అయితే కొద్ది రోజులకే ఆమె బండారం అంత బయటపడింది. దీంతో పోలీసులు జైలుకు పంపారు. కొన్ని రోజుల తర్వాత జైలు నుంచి బయటికి వచ్చి మళ్లీ అదే తప్పు దారి పట్టింది.

A women do illegal activities in Hyderabad

A women do illegal activities in Hyderabad

ఈసారి బంజారా హిల్స్లో పర్పుల్ న్యుచరల్ హెల్త్ త్రు ఆయుర్వేదిక్ పేరుతో శృతి రమణ, జాన్ కలిసి స్పా సెంటర్ ను ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు స్పా సెంటర్లో వ్యభిచార పనులు నడిపింది. బయట స్పా సెంటర్ అని, లోపల మాత్రం అశ్లీల వ్యవహారాలు నడుపుతున్నారు. ఇటువంటి వ్యవహారాలు హైదరాబాద్ లో కామన్ అయిపోయింది. ఇంతలోనే చుట్టుపక్కన ఉన్నా స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ యువతి బండారం అంతా బయట పడింది.ఆ స్పా ముసుగులో ఉన్నా మెుత్తం ముగ్గురు నిర్వహకులు, 10మంది యువతులు, 18 మంది విటులు పట్టుబడ్డారు. వీళ్ళని జైల్ కు పంపారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది