Hyderabad : గంజాయి చాక్లెట్.. హైదరాబాద్ లో మెడికల్, ఇంజనీరింగ్ స్టూడెంట్సే టార్గెట్
Hyderabad : సాధారణంగా చాక్లెట్లు అంటే ఇష్టం ఉండని వాళ్లు ఎంతమంది ఉంటారు. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. అందుకే.. మార్కెట్ లోకి సరికొత్తగా కేటుగాళ్లు గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చారు. సాధారణంగా గంజాయిని సరఫరా చేస్తే పోలీసులు పట్టుకుంటారని.. స్మగ్లర్లు పలు రకాల స్కెచ్ లు వేస్తారని తెలుసు కదా. అందులో భాగంగానే గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చారు.

ganja chocolates rocket busted in hyderabad
చాక్లెట్లను చూస్తే ఎవ్వరికీ అనుమానం రాదని.. వాటిని హైదరాబాద్ మార్కెట్ లో దర్జాగా అమ్ముతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలనే టార్గెట్ గా చేసుకొని గంజాయిని చాక్లెట్ల రూపంలో అమ్ముతున్నారు. తాజాగా ఒక పాన్ షాపులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన షాద్ నగర్ పోలీసులు వెంటనే దాడులు నిర్వహించి గంజాయి చాక్లెట్ల గుట్టును రట్టు చేశారు.
Hyderabad : ఒడిశా నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నారు
ఒడిశా నుంచి హైదరాబాద్ కు గంజాయిని చాక్లెట్ల రూపంలో తీసుకొచ్చి నగరంలో ఉన్న విద్యార్థులను టార్గెట్ చేసుకొని విక్రయిస్తున్నారు. వెంటనే పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన షాద్ నగర్ పోలీసులు.. గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు గంజాయి స్మగ్లర్లను కూడా పట్టుకున్నారు. సాధారణంగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తే పోలీసులకు దొరికిపోతారని.. ఇలా పలు విధాలుగా తమ క్రియేటివిటీని ఉపయోగించి గంజాయి స్మగ్లర్లు చెలరేగిపోతున్నట్టు తెలుస్తోంది.