Hyderabad Bullet Train : హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు గుడ్‌ న్యూస్‌.. త్వర‌లో భాగ్యన‌గ‌రానికి బుల్లెట్ రైలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyderabad Bullet Train : హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు గుడ్‌ న్యూస్‌.. త్వర‌లో భాగ్యన‌గ‌రానికి బుల్లెట్ రైలు..!

 Authored By sekhar | The Telugu News | Updated on :28 November 2022,7:40 pm

Hyderabad Bullet Train : భారతదేశంలో అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. అనేక రంగాలకు సంబంధించి హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతుంది. కొద్ది సంవత్సరాల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్.. హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ వ్యాపార సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా హైదరాబాద్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ..

అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు హైదరాబాద్ వాసులకు త్వరలో బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం రెడీ అయింది. పూర్తి విషయంలోకి వెళ్తే దేశ ఆర్థిక రాజధాని ముంబై హైదరాబాద్ నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రారంభించే ఆలోచనలో కేంద్రం ఉంది. ఈ ప్రాజెక్టును కేంద్రంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. ఈ క్రమంలో థానే జిల్లాలో పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ మహారాష్ట్ర సర్కార్ స్టార్ట్ చేసింది. ఇదే సమయంలో తెలంగాణలో సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలలో పెద్ద ఎత్తున భూసేకరణ అవసరం కానుంది.

Good news for people Hyderabad of Bullet Train

Good news for people Hyderabad of Bullet Train

దీంతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన నేషనల్ హై స్పీడ్ రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) అధికారులు ఇటీవల సంగారెడ్డి కలెక్టరేట్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో భూసేకరణకు సంబంధించి ఏరియల్ సర్వే.. నిర్వహించి డిపిఆర్ సిద్ధం చేయాలని సూచించారు. అయితే డిపిఆర్ ఆమోదం పొందుతే ఈ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు.. స్టార్ట్ కానుంది. హైదరాబాద్ ముంబై నగరాల మధ్య దూరం 711 కిలోమీటర్లు. ఇని వందల కిలోమీటర్లు ప్రయాణించడానికి ప్రస్తుతం అతివేగంగా ప్రయాణిస్తున్న రైళ్లకు దాదాపు 12 నుంచి 14 గంటల సమయం పట్టనుంది. అయితే బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే మాత్రం కేవలం మూడు గంటల సమయంలోనే హైదరాబాదు నుండి.. ముంబైకు చేరుకునే పరిస్థితి ఉంటది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది