
pista house starts first flight restaurant in hyderabad
Hyderabad : మీరు ఎప్పుడైనా విమానం ఎక్కారా? అందులో ఫుడ్ తిన్నారా? విమానం ఎక్కాం.. విమానంలో ఎయిర్ హోస్టెస్ లు ఇచ్చే ఫుడ్ తిన్నాం ఇప్పుడు ఏమైంది అంటారా? కానీ.. విమానంలోనే రెస్టారెంట్ ఉంటే.. అప్పుడు విమానంలో కూర్చొని ఏం చక్కా బయటి అందాలు చూసుకుంటూ భోం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి.. అవును ఈ ఐడియా ఏదో బాగుంది అంటారా? అందుకే.. హైదరాబాద్ లోనే ఫేమస్ అయిన పిస్తా హౌస్ తాజాగా విమానం రెస్టారెంట్ ను ఏర్పాటు చేసింది.
pista house starts first flight restaurant in hyderabad
ఎయిర్ బస్ కంపెనీకి చెందిన ఏ320 అనే విమానంలో తొలి విమానం రెస్టారెంట్ ను పిస్తా హౌస్ స్టార్ట్ చేసింది. కానీ.. ఇంకా ఆహార ప్రియులకు అది అందుబాటులోకి రాలేదు. త్వరలోనే అది అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ లోని శామీర్ పేటలో ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయనున్నారు.
అచ్చం ఎయిర్ పోర్ట్ ను తలపించేలా రెస్టారెంట్ ను ఏర్పాటు చేయనుంది పిస్తా హౌస్. రెస్టారెంట్ చుట్టూ బోర్డింగ్ పాస్, సెక్యూరిటీ చెక్, రన్ వే.. ఇలా అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. విమానంలో 150 సీట్లు ఉంటాయి. శామీర్ పేట చెరువు పక్కన ఈ విమానం రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. కానీ.. కొన్ని పనులు పూర్తవగానే.. రెస్టారెంట్ ను అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారు. ఈ విమానాన్ని కేరళ నుంచి పేద్ద లారీలో హైదరాబాద్ కు తరలించారు. ఇక.. ఈ రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని నగర వాసులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.