Hyderabad : విమానం ఎక్కి ఏం చక్కా భోజనం చేయొచ్చు.. ఈ విమానం రెస్టారెంట్ హైదరాబాద్ లో ఎక్కడుందంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyderabad : విమానం ఎక్కి ఏం చక్కా భోజనం చేయొచ్చు.. ఈ విమానం రెస్టారెంట్ హైదరాబాద్ లో ఎక్కడుందంటే?

Hyderabad : మీరు ఎప్పుడైనా విమానం ఎక్కారా? అందులో ఫుడ్ తిన్నారా? విమానం ఎక్కాం.. విమానంలో ఎయిర్ హోస్టెస్ లు ఇచ్చే ఫుడ్ తిన్నాం ఇప్పుడు ఏమైంది అంటారా? కానీ.. విమానంలోనే రెస్టారెంట్ ఉంటే.. అప్పుడు విమానంలో కూర్చొని ఏం చక్కా బయటి అందాలు చూసుకుంటూ భోం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి.. అవును ఈ ఐడియా ఏదో బాగుంది అంటారా? అందుకే.. హైదరాబాద్ లోనే ఫేమస్ అయిన పిస్తా హౌస్ తాజాగా విమానం రెస్టారెంట్ ను […]

 Authored By kranthi | The Telugu News | Updated on :27 November 2022,8:30 am

Hyderabad : మీరు ఎప్పుడైనా విమానం ఎక్కారా? అందులో ఫుడ్ తిన్నారా? విమానం ఎక్కాం.. విమానంలో ఎయిర్ హోస్టెస్ లు ఇచ్చే ఫుడ్ తిన్నాం ఇప్పుడు ఏమైంది అంటారా? కానీ.. విమానంలోనే రెస్టారెంట్ ఉంటే.. అప్పుడు విమానంలో కూర్చొని ఏం చక్కా బయటి అందాలు చూసుకుంటూ భోం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి.. అవును ఈ ఐడియా ఏదో బాగుంది అంటారా? అందుకే.. హైదరాబాద్ లోనే ఫేమస్ అయిన పిస్తా హౌస్ తాజాగా విమానం రెస్టారెంట్ ను ఏర్పాటు చేసింది.

pista house starts first flight restaurant in hyderabad

pista house starts first flight restaurant in hyderabad

ఎయిర్ బస్ కంపెనీకి చెందిన ఏ320 అనే విమానంలో తొలి విమానం రెస్టారెంట్ ను పిస్తా హౌస్ స్టార్ట్ చేసింది. కానీ.. ఇంకా ఆహార ప్రియులకు అది అందుబాటులోకి రాలేదు. త్వరలోనే అది అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ లోని శామీర్ పేటలో ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయనున్నారు.

Hyderabad : ఎయిర్ పోర్ట్ ను తలపించేలా రెస్టారెంట్ చుట్టూ బోర్డింగ్ పాస్, సెక్యూరిటీ చెక్

అచ్చం ఎయిర్ పోర్ట్ ను తలపించేలా రెస్టారెంట్ ను ఏర్పాటు చేయనుంది పిస్తా హౌస్. రెస్టారెంట్ చుట్టూ బోర్డింగ్ పాస్, సెక్యూరిటీ చెక్, రన్ వే.. ఇలా అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. విమానంలో 150 సీట్లు ఉంటాయి. శామీర్ పేట చెరువు పక్కన ఈ విమానం రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. కానీ.. కొన్ని పనులు పూర్తవగానే.. రెస్టారెంట్ ను అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారు. ఈ విమానాన్ని కేరళ నుంచి పేద్ద లారీలో హైదరాబాద్ కు తరలించారు. ఇక.. ఈ రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని నగర వాసులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది