Kokapet Land Value : కోకాపేటలో ఎకరాకు వంద కోట్లు.. దాని వెనుక అసలు నిజం ఇదే
Kokapet Land Value : ఒక ఎకరం లాండ్ వాల్యూ ఎంతుంటుంది చెప్పండి. ఆ ప్రాంతాన్ని బట్టి రేటు ఉంటుంది కదా. గ్రామాల్లో అయితే 20 లక్షలు, 30 లక్షలు.. మా అంటే 50 లక్షలు. రోడ్డు పక్కన ఉంటే రేటు పెరుగుతుంది. అదే పట్టణాల్లో అంటే కోటి, రెండు కోట్లు వేసుకోండి. అది నగరం నడిబొడ్డు అయితే.. కోట్లు పలుకుతుంది అనుకోవచ్చు కానీ.. నగరానికి దూరంగా ఉన్న కోకాపేట ప్రాంతంలో ఎకరా స్థలం 100 కోట్లు పలకడం ఏంటి. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. కానీ.. దాని వెనుక ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోకాపేటలో ఉన్న నియో పాలిస్ లే అవుట్ లో ఒక్క ఎకరం స్థలం వంద కోట్లు పలికిందని తెలంగాణ ప్రభుత్వం మీసాలు మెలేసి మరీ చెబుతోంది. కానీ.. కోకాపేటలోనేనా.. లేక హైదరాబాద్ మొత్తం అంతే ధర ఉందా అంటే చెప్పే పరిస్థితులు లేవు. అసలు నగరం నడిబొడ్డున కూడా అంత రేటు లేనప్పుడు.. ఎక్కడో హైదరాబాద్ కు ఔట్ స్కర్ట్ లో ఉన్న కోకాపేటలో ఎందుకు లాండ్ వాల్యూ అంత పెరిగింది అనే డౌట్ మీకు రావచ్చు. ఒక్క ఎకరా ధర వంద కోట్లు అంటే ఒక్క గజం ధరే రెండున్నర లక్షలు ఉంటుంది. హైదరాబాద్ లో ఒక గజం ధర రెండున్నర లక్షలకంటే ఎక్కువగా ఉందా? అది కూడా నగరానికి దూరంలో.నిజమే.. కోకాపేట ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. అక్కడ ఆకాశ హార్మ్యాలు వెలుస్తున్నాయి. కానీ.. అంత ధర నిజంగా పలుకుతోందా? అంత ధర పెట్టి కొని అపార్ట్ మెంట్ కట్టాలంటే బిల్డర్లకు అయ్యే పనేనా? ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవాలన్నా కోటీశ్వరులకు కూడా సాధ్యం కాని పని అది.
Kokapet Land Value : అసలు కోకాపేటలో ఏం జరుగుతోంది?
అయితే.. ఒక్క ఎకరంలో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి రావడం వల్ల అక్కడ గజాల్లో భూమిని డివైడ్ చేస్తే.. అప్పుడు అక్కడ ఎకరానికి రూ.100 కోట్లు పలికింది తప్పితే కోకాపేట మొత్తం ఎక్కడ చూసినా అదే ధర మాత్రం లేదు. అన్ని ప్రాంతాలకు ఈ రేటు వర్తించడం లేదు. అలాగే అన్ని లేఅవుట్స్ కు కూడా ఈ రేట్ వర్తించదు అనే విషయాన్ని గమనించాలి.