Shilpa Layout Flyover : హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈరోజు నుంచి శిల్ప ఫ్లైఓవర్ ప్రారంభం
Shilpa Layout Flyover : హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఎందుకంటే.. ఐటీ కారిడార్ లో నిర్మించిన ఓ ఫ్లైఓవర్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఎస్ఆర్డీపీ కింది ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. దీనికి శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ అని పేరు పెట్టారు. గచ్చిబౌలి జంక్షన్ దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ నుంచి శిల్పా లే అవుట్ వరకు ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. దీన్ని 4 లేన్ల బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ గా నిర్మించారు.
హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాలు ఐటీ కారిడార్స్ అని తెలుసు కదా. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు… గచ్చిబౌలి నుంచి శిల్పా లే అవుట్ వరకు ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. దాదాపు రూ.250 కోట్లతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. 956 మీటర్ల పొడవు అంటే అటూ ఇటుగా కిలోమీటర్ పొడవు ఉంటుంది. 16.60 మీటర్ల వెడల్పుతో నిర్మించారు.
Shilpa Layout Flyover : రెండో దశ ప్రాజెక్టు వచ్చే సంవత్సరం పూర్తి
రెండో దశలో భాగంగా… ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి వరకు బొటానికల్ గార్డెన్ రోడ్డు వరకు శిల్పా లేఅవుట్ రెండో ప్రాజెక్ట్ నిర్మాణం.. వచ్చే సంవత్సరం డిసెంబర్ 2023 నాటికి పూర్తవుతుంది. మొదటి దశలో భాగంగా ఇవాళ మంత్రి కేటీఆర్ ఈ వంతెనను ప్రారంభించనున్నారు. ఈ వంతెన ప్రారంభం అయితే కొద్దిలో కొద్ది ఐటీ కారిడార్ వైపు వచ్చే ఐటీ ఉద్యగులకు, ఇతర వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. డైరెక్ట్ గా ఈ ఫ్లైఓవర్ ఎక్కి ఎటువంటి ట్రాఫిక్ లేకుండా వాహనదారులు వెళ్లొచ్చు.