
iit student sabjikothi refrigerate storage divice innovation helps farmers
IIT Student : ముని నాయుడు.. టమోటా పంట వేశారు. దిగుబడి బాగా వచ్చింది. అయితే, ధర మరీ తగ్గిపోయింది. ధర వచ్చే వరకు పంటను అమ్మకుండా ఉందామంటే శీతల గిడ్డంగి లేదు. కాబట్టి చెప్పిన ధరకు అమ్ముకోక తప్పని దుస్థితి రైతులది. మార్కెట్‌లో ధర లేదన్న సాకుతో రైతుల నుంచి చౌకగా కొనడం ప్రారంభించారు దళారులు.. ఇలా ఒకటి, రెండు పంటల విషయంలోనే కాదు. కూరగాయల మొదలు వివిధ రకాల ఉద్యాన పంటల మార్కెటింగ్ పరిస్థితీ ఇదే…టమాటా బయటి మార్కెట్‌లో కిలో రూ. 15 – 20 అమ్ముతున్నా రైతులకు మాత్రం కిలోకి ఒకటి రెండు రూపాయలు కూడా దక్కడం లేదు. ఉల్లి రైతులదీ అదే పరిస్థితి.
రైతులు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పండించే తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే సౌకర్యం లేకపోవడమే ఇందుకు కారణం. రైతుల సమస్యకు చెక్ పెట్టడానికి బీహార్ కుం చెందిన ఐఐటీ గ్రాడ్యుయేట్ నిక్కి కుమార్ జా అతని సోదరి రష్మీ జా తో కలిసి ‘సబ్జీ కోటీ’ అనే ఓ పరికరాన్ని కనిపెట్టాడు.సబ్జీకోటీ రిఫ్రిజిరేటర్ కంటే 10 రెట్లు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పండ్లు, కూరగాయలను 3 నుంచి 30 రోజుల వరకు నిల్వ చేస్తుంది. రిఫ్రిజిరేటర్ ధరలో సగం ఖరీదు మాత్రమే.. రోజుకు ఒక లీటరు నీరు మరియు 20 వాట్ల విద్యుత్ అవసరం. దీనికి 10 వాట్స్ పవర్ మాత్రమే అవసరం, ఇది మన ఫోన్లకు వాడే చార్జింగ్ కు సమానం.
iit student sabjikothi refrigerate storage divice innovation helps farmers
IIT Student : నిల్వ సౌకర్యాల కొరత కారణంగా హార్టికల్చర్ ఉత్పత్తులు వృధా అవ్వడం చూసి ఇలాంటి ఆవిష్కరణ చేసినట్లు నిక్కి కుమార్ తెలిపారు. ఈ పరికరాన్ని సులభంగా రవాణా చేయవచ్చు. ద్రవాన్ని కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, ఆవిరిలోకి ఆక్సీకరణం చేయడం ద్వారా పరికరం లోపల నియంత్రిత వాతావరణాన్ని నిర్వహిస్తుంది. పంటల ద్వారా విడుదలయ్యే ఇథిలీన్ వాయువు క్షీణించడం వల్ల అవి పండడం మరియు కుళ్ళిపోవడం ఆలస్యం అవుతుంది.’ ఈ పరికరం ద్వారం పంట కోత తర్వాత వృధాను నియంత్రించడమే కాకుండా, రైతు తమ ఉత్పత్తులను కొన్ని రోజులు నిల్వ ఉంచి.. మంచి ధరను పొందవచ్చు.’- నిక్కి కుమార్
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.