IIT Student : పేదోడి ఫ్రిడ్జ్.. 30 రోజుల వరకు కూరగాయలు ఫ్రెష్.. కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువ.. దీన్ని ఎవరు తయారు చేశారో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IIT Student : పేదోడి ఫ్రిడ్జ్.. 30 రోజుల వరకు కూరగాయలు ఫ్రెష్.. కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువ.. దీన్ని ఎవరు తయారు చేశారో తెలుసా?

 Authored By aruna | The Telugu News | Updated on :3 February 2022,2:00 pm

IIT Student : ముని నాయుడు.. టమోటా పంట వేశారు. దిగుబడి బాగా వచ్చింది. అయితే, ధర మరీ తగ్గిపోయింది. ధర వచ్చే వరకు పంటను అమ్మకుండా ఉందామంటే శీతల గిడ్డంగి లేదు. కాబట్టి చెప్పిన ధరకు అమ్ముకోక తప్పని దుస్థితి రైతులది. మార్కెట్‌లో ధర లేదన్న సాకుతో రైతుల నుంచి చౌకగా కొనడం ప్రారంభించారు దళారులు.. ఇలా ఒకటి, రెండు పంటల విషయంలోనే కాదు. కూరగాయల మొదలు వివిధ రకాల ఉద్యాన పంటల మార్కెటింగ్‌ పరిస్థితీ ఇదే…టమాటా బయటి మార్కెట్‌లో కిలో రూ. 15 – 20 అమ్ముతున్నా రైతులకు మాత్రం కిలోకి ఒకటి రెండు రూపాయలు కూడా దక్కడం లేదు. ఉల్లి రైతులదీ అదే పరిస్థితి.

రైతులు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పండించే తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే సౌకర్యం లేకపోవడమే ఇందుకు కారణం. రైతుల సమస్యకు చెక్ పెట్టడానికి బీహార్ కుం చెందిన ఐఐటీ గ్రాడ్యుయేట్ నిక్కి కుమార్ జా అతని సోదరి రష్మీ జా తో కలిసి ‘సబ్జీ కోటీ’ అనే ఓ పరికరాన్ని కనిపెట్టాడు.సబ్జీకోటీ రిఫ్రిజిరేటర్ కంటే 10 రెట్లు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పండ్లు, కూరగాయలను 3 నుంచి 30 రోజుల వరకు నిల్వ చేస్తుంది. రిఫ్రిజిరేటర్ ధరలో సగం ఖరీదు మాత్రమే.. రోజుకు ఒక లీటరు నీరు మరియు 20 వాట్ల విద్యుత్ అవసరం. దీనికి 10 వాట్స్ పవర్ మాత్రమే అవసరం, ఇది మన ఫోన్లకు వాడే చార్జింగ్ కు సమానం.

iit student sabjikothi refrigerate storage divice innovation helps farmers

iit student sabjikothi refrigerate storage divice innovation helps farmers

పేదోడి ఫ్రిడ్జ్. కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువ దీన్ని ఎవరు తయారు చేశారో తెలుసా ?

IIT Student :  నిల్వ సౌకర్యాల కొరత కారణంగా హార్టికల్చర్ ఉత్పత్తులు వృధా అవ్వడం చూసి ఇలాంటి ఆవిష్కరణ చేసినట్లు నిక్కి కుమార్‌ తెలిపారు. ఈ పరికరాన్ని సులభంగా రవాణా చేయవచ్చు. ద్రవాన్ని కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, ఆవిరిలోకి ఆక్సీకరణం చేయడం ద్వారా పరికరం లోపల నియంత్రిత వాతావరణాన్ని నిర్వహిస్తుంది. పంటల ద్వారా విడుదలయ్యే ఇథిలీన్ వాయువు క్షీణించడం వల్ల అవి పండడం మరియు కుళ్ళిపోవడం ఆలస్యం అవుతుంది.’ ఈ పరికరం ద్వారం పంట కోత తర్వాత వృధాను నియంత్రించడమే కాకుండా, రైతు తమ ఉత్పత్తులను కొన్ని రోజులు నిల్వ ఉంచి.. మంచి ధరను పొందవచ్చు.’- నిక్కి కుమార్‌

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది