Jobs : విద్యుత్‌ సంస్థల్లో 3 వేల ఉద్యోగాల భ‌ర్తీ.. అక్టోబ‌ర్‌లో నోటిఫికేషన్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jobs : విద్యుత్‌ సంస్థల్లో 3 వేల ఉద్యోగాల భ‌ర్తీ.. అక్టోబ‌ర్‌లో నోటిఫికేషన్‌..!

Jobs : విద్యుత్‌ సంస్థల్లో పెద్ ఎత్తున‌ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం అక్టోబరులో విద్యుత్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. 4 విద్యుత్‌ సంస్థల్లో 3 వేలకు పైగా ఖాళీలున్నట్లు, ఈ నేపథ్యంలో వివరాలన్నీ పంపాలని విద్యుత్‌ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగిన‌ట్లుగా సమాచారం. దాంతో క్యాడర్‌ వారీగా వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ఇటీవల డిస్కంలు, ట్రాన్స్‌కోలలో పెద్దఎత్తున పదోన్నతులు […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 September 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Jobs : విద్యుత్‌ సంస్థల్లో 3 వేల ఉద్యోగాల భ‌ర్తీ.. అక్టోబ‌ర్‌లో నోటిఫికేషన్‌..!

Jobs : విద్యుత్‌ సంస్థల్లో పెద్ ఎత్తున‌ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం అక్టోబరులో విద్యుత్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. 4 విద్యుత్‌ సంస్థల్లో 3 వేలకు పైగా ఖాళీలున్నట్లు, ఈ నేపథ్యంలో వివరాలన్నీ పంపాలని విద్యుత్‌ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగిన‌ట్లుగా సమాచారం. దాంతో క్యాడర్‌ వారీగా వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ఇటీవల డిస్కంలు, ట్రాన్స్‌కోలలో పెద్దఎత్తున పదోన్నతులు క‌ల్పించారు. జెన్‌కోలో ఈ ప్రక్రియ ఇంకా కొన‌సాగుతున్న‌ది. పదోన్నతులతో కిందిస్థాయిలో 3 వేలకు పైగా ఖాళీలు ఏర్పడ‌నున్న‌ట్లు స‌మాచారం. వీటన్నింటినీ నేరుగా నోటిఫికేష‌న్లు ఇచ్చి భర్తీ చేయ‌నున్నారు. అసిస్టెంట్‌ లైన్‌మెన్, జూనియర్‌ లైన్‌మెన్, సబ్‌ ఇంజినీరు, సహాయ ఇంజినీర్ తో పాటు ఇతర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంతో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కోలలో సహాయ ఇంజినీరు పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది.

Jobs : పదోన్నతులపై వివాదం..

యాదాద్రి థ‌ర్మ‌ల్ విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రం మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. దీనికి అవసరమైన సహాయ డివిజినల్‌ ఇంజినీరు(ఏడీఈ), డివిజినల్, పర్యవేక్షక ఇంజినీరు పోస్టులను సైతం పదోన్నతులపై భర్తీ చేయబోతున్నారు. వీటితో కిందిస్థాయిలో సహాయ ఇంజినీరు పోస్టులు ఖాళీ కానున్నాయి. యాదాద్రిలో విద్యుదుత్పత్తి ప్రారంభం కాబోతున్నందున పైస్థాయి పోస్టుల భర్తీకి పదోన్నతులు ఇప్పుడే ఇవ్వాలని విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అయితే ఉత్పత్తి ప్రారంభమయ్యాకే ఇస్తామని జెన్‌కో యాజమాన్యం చెబుతోంది.

Jobs విద్యుత్‌ సంస్థల్లో 3 వేల ఉద్యోగాల భ‌ర్తీ అక్టోబ‌ర్‌లో నోటిఫికేషన్‌

Jobs : విద్యుత్‌ సంస్థల్లో 3 వేల ఉద్యోగాల భ‌ర్తీ.. అక్టోబ‌ర్‌లో నోటిఫికేషన్‌..!

పెగడపల్లిలో సింగరేణి థర్మల్‌ విద్యుత్కేంద్రం నిర్వహణను జెన్‌కోకు అప్పగిస్తారని దానికి అవసరమైన పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఈ నిర్వహణ పనులను టెండరులో ఓ ప్రైవేటు సంస్థ దక్కించుకుంది. దీంతో ఈ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా పదోన్నతుల ద్వారా భ‌ర్తీ చేసి భద్రాద్రి, యాదాద్రి విద్యుత్కేంద్రాల్లో ఉపయోగించుకోవాలని సంఘాలు కోరుతున్నాయి. కాగా దీనివల్ల పోస్టులు, ఆర్థికభారం పెరుగుతుందని యాజమాన్యం ప్ర‌క్రియ‌ను నిలిపివేసింది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది