EPF : ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వారికి EPF శుభవార్త…పిఎఫ్ డబ్బు మొత్తం ఇలా పొందండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

EPF : ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వారికి EPF శుభవార్త…పిఎఫ్ డబ్బు మొత్తం ఇలా పొందండి…

EPF :  ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగులకు ఈపీఎఫ్ అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగులకు ఒక శుభవార్త. ఇక నుండి ఆరు నెలలు పని చేస్తే సరిపడా ఈపీఎఫ్ డబ్బులు మీరు పొందవచ్చు. మరి దీని గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూన్ 26న కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ 1995 నిబంధనలను మార్చినట్లుగా తెలియజేసింది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయోజనాలను […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 July 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  EPF : ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వారికి EPF శుభవార్త...పిఎఫ్ డబ్బు మొత్తం ఇలా పొందండి...

EPF :  ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగులకు ఈపీఎఫ్ అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగులకు ఒక శుభవార్త. ఇక నుండి ఆరు నెలలు పని చేస్తే సరిపడా ఈపీఎఫ్ డబ్బులు మీరు పొందవచ్చు. మరి దీని గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జూన్ 26న కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ 1995 నిబంధనలను మార్చినట్లుగా తెలియజేసింది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయోజనాలను పొందవచ్చు అని తెలిపింది. అయితే ప్రైవేట్ ఉద్యోగి జీతంలో 12 శాతం ఈపీఎఫ్ మరియు పిఎఫ్ రూపంలో జమ చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగి కోసం అంతే మొత్తంలో ఇక్కడ పెట్టుబడి పెడుతుంది. అంటే 8.3 శాతం డబ్బు ఈపీఎఫ్ లో మరియు 3.6% డబ్బు పిఎఫ్ లోకి వెళ్తుంది. అయితే ఇప్పటివరకు ఎవరైనా సరే ఆరు నెలలు ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసి ఉద్యోగం వదులుకుంటే వారికి ఈపీఎఫ్ వచ్చేది కాదు. కానీ ప్రస్తుతం మారిన నిబంధనల ప్రకారం ఆరు నెలల ముందే ఉద్యోగం వదిలినప్పటికీ మీరు ఈపీఎఫ్ ను పొందవచ్చు.

అయితే ఈపీఎఫ్ డబ్బు విత్ డ్రా చేసుకోవాలి అంటే ఆ వ్యక్తి ఎంత కాలం కంపెనీలో పని చేశాడు అనేది చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు ఆరు నెలల్లో ఉద్యోగం మానేసినప్పటికీ పిఎఫ్ సొమ్ము పొందే విధంగా నిబంధనలను ప్రభుత్వం అధికారికంగా అమలు చేసింది. దీని ద్వారా దాదాపు 23 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది.

EPF ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వారికి EPF శుభవార్తపిఎఫ్ డబ్బు మొత్తం ఇలా పొందండి

EPF : ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వారికి EPF శుభవార్త…పిఎఫ్ డబ్బు మొత్తం ఇలా పొందండి…

అయితే ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం పింఛన్ పొందాలంటే కనీసం 10 ఏళ్లపాటుు పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు కంపెనీ నుంచి వచ్చే సంవత్సరం లెక్కింపు ఆధారంగా పీఎఫ్ డబ్బు ఉపసంహరణ నిర్ణయించబడుతుంది. అయితే ప్రైవేట్ సంస్థలలో పని చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ నియమం చాలా ముఖ్యమైనది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది