Indian post payment bank : ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Indian post payment bank : ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు…

Indian post payment bank : నిరుద్యోగులకు శుభవార్త… తాజాగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 April 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Indian post payment bank : ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు...

  •  Indian post payment bank : నిరుద్యోగులకు శుభవార్త... తాజాగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల

  •  నిరుద్యొగుల‌కు శుభ‌వార్త ...డిగ్రీ ఉద్యోగాలు అప్లై చేయాల‌నుకుంటున్నారా ..అయితే ఇలా చేయండి...!

Indian post payment bank : నిరుద్యోగులకు శుభవార్త… తాజాగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ.

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుండి పలు రకాల ఖాళీలను భర్తీ చేసేందుకు విడుదల కావడం జరిగింది.

ఖాళీలు….

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత. .

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారి వయస్సు 1-03-2024 నాటికి కనిష్టంగా 21 నుండి గరిష్టంగా 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

జీతం. ..

ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఎంపికైన వారికి రూ.30000 జీతం ప్రతినెల చెల్లించబడుతుంది.

ఎంపిక విధానం. .

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా ఆన్లైన్ టెస్ట్/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రుసుము…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే జనరల్ అభ్యర్థులకు రూ.750 ఫీజ్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా SC,ST ,దివ్యాంగ అభ్యర్థులకు 150 రూపాయల ఫీజు నిర్ణయించడం జరిగింది.

ముఖ్యమైన తేదీలు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ఏప్రిల్ 5 2024 లోపు చేసుకోగలరు.

ఎలా దరఖాస్తు చేయాలంటే…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ముందుగా సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసే సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది