Railway Jobs : గుడ్‌న్యూస్.. రైల్వే డిపార్టుమెంట్ లో జాబులు.. 10 పాసైతే చాలు..!
ప్రధానాంశాలు:
Railway Jobs : గుడ్‌న్యూస్.. రైల్వే డిపార్టుమెంట్ లో జాబులు.. 10 పాసైతే చాలు..!
Railway Jobs : ఈ రోజుల్లో చాలా మంది నిరుద్యోగులు ఒక్క ఉద్యోగం వస్తే చాలు అని ఆరాటపడుతున్నారు. ప్రతి గవర్నమెంట్ జాబుకు అప్లై చేస్తూ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటున్నారు. అయితే కొన్ని ఉద్యోగాలకు డిగ్రీ కావాలని అర్హతగా పెడుతున్న సంగతి తెలిసిందే కదా. కాగా కొందరు పది పాసైన వారికి కూడా గవర్నమెంట్ జాబులు కావాలనే ఆశ ఉంటుంది. అలాంటి వారికోసమే ఇప్పుడు ఓ అద్భుతమైన న్యూస్ ను తీసుకువచ్చాం. తాజాగా న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్.. నార్తర్న్ రైల్వే ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఇందులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు.
గ్రూప్-డీ లో పోస్టులకు అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 38 ఉద్యోగాలకు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. పది పాసైతే చాలు. ఆ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో వివిధ స్థాయిల్లో ప్రతిభ చూపించిన వారికి అర్హత ఉంటుందని చెబుతున్నారు. స్పోర్ట్స్ లో ప్రతిభ ఎక్కువగా చూపించిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. దీని కోసం ఆన్ లైన్ లో మే 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 16లోపు అప్లై చేసుకోలేని వారం కోసం మరింత సమయం పెంచనున్నారు అధికారులు.
Railway Jobs పూర్తి సమాచారం..
స్పోర్ట్స్ కోటా గ్రూప్-డీ: 38 పోస్టులు
క్రీడలుః ఫుట్ బాల్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, రెజ్లింగ్, చెస్ లాంటి ఆటల్లో ప్రతిభ చూపించిన వారికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
అర్హత..
ఈ జాబుల కోసం 10వ తరగతి పాసైతే చాలు. దాంతో సంబంధిత క్రీడాంశంలో వివిధ స్థాయుల్లో ప్రతిభ చూపించాలి.
వయోపరిమితి:
2024 జులై 1వ తేదీ నాటికి 18-25 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, మైనారిటీలు, ఈబీసీ దరఖాస్తుదారులకు రూ.250గా ఫీజు ఉంది. ఇక ఇతరులకు రూ.400తో అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..
ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 16, 2024