Supreme Court Jobs : ఎల్ఎల్‌బీ అవ‌స‌రం లేకుండానే కోర్టులో ఉద్యోగాలు .. జీతం 40వేల‌కి పైనే..!

 Authored By ramu | The Telugu News | Updated on :22 August 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Supreme Court Jobs : ఎల్ఎల్‌బీ అవ‌స‌రం లేకుండానే కోర్టులో ఉద్యోగాలు .. జీతం 40వేల‌కి పైనే..!

Supreme Court Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎంత ప‌డిగాపులు కాస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే వారికి ఓ శుభ‌వార్త అందింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సాధారణంగా కోర్టు ఉద్యోగాలంటే లా డిగ్రీ ఉండాలని అంద‌రు భావిస్తారు. కానీ ఈ జాబ్స్ కు మాత్రం ఎల్ఎల్బీ అవసరం లేదు. ఈ జాబ్స్ కు ఎంపికైతే నెలకు రూ. 46210 జీతం పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారు ఈ అవకాశాన్ని అస్స‌లు వ‌దులుకోవద్దు.

Supreme Court Jobs ఆల‌స్యం చేయ‌కండి..

సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కాగా, దీని ద్వారా 80 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణతతో పాటు కుకింగ్/ కులినరీ లో వన్ ఇయర్ డిప్లొమా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.46,210 చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.sci.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Supreme Court Jobs : ఎల్ఎల్‌బీ అవ‌స‌రం లేకుండానే కోర్టులో ఉద్యోగాలు .. జీతం 40వేల‌కి పైనే..!

Supreme Court Jobs : ఎల్ఎల్‌బీ అవ‌స‌రం లేకుండానే కోర్టులో ఉద్యోగాలు .. జీతం 40వేల‌కి పైనే..!

అర్హత: పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.400; ఎస్సీ/ ఎస్టీ / ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ / మహిళా/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు, దిల్లీ, కేరళ, అస్సాం, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్‌ వర్క్ సెంటర్లు/ యూనిట్‌లలో పలు విభాగాల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 391 నాన్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి