Supreme Court Jobs : కోర్టుల్లో ఉద్యోగాలు.. డిగ్రీ పూర్తి చేసిన వారికి 72040 జీతం..!
ప్రధానాంశాలు:
Supreme Court Jobs : కోర్టుల్లో ఉద్యోగాలు.. డిగ్రీ పూర్తి చేసిన వారికి 72040 జీతం..!
Supreme Court Jobs : డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులకి శుభవార్త. చాలా మంది ఉద్యోగాల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కల్పిస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 241 కాగా, ఇందులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 5 నుండి, ఇక దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు 2025 మార్చి 8 లోగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
![Supreme Court Jobs కోర్టుల్లో ఉద్యోగాలు డిగ్రీ పూర్తి చేసిన వారికి 72040 జీతం](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Supreme-Court-Jobs.jpg)
Supreme Court Jobs : కోర్టుల్లో ఉద్యోగాలు.. డిగ్రీ పూర్తి చేసిన వారికి 72040 జీతం..!
Supreme Court Jobs మంచి అవకాశం..
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల వయస్సు మించరాదు. (2025 మార్చి 8 నాటికి 30 ఏళ్ల వయస్సు మించరాదు)కొంతమంది అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది. విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్ వచ్చి ఉండాలి. 35 wpm స్పీడుతో టైపింగ్ వచ్చి ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ ఆపరేషన్ పై కొంచె నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగ అభ్యర్థులు రూ.250 ఉంటుంది.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.35,400 నుంచి రూ.72,040 వరకు ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. 10 సమయంతో టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. 35 వర్డ్ పర్ మినిట్ స్పీడుతో టైపింగ్ చేయాల్సి ఉంటుంది.2 గంటల సమయంతో డిస్ట్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో కాంప్రహెన్సివ్ ప్యాసేజ్, వ్యాస రచన ఉంటుంది. ఈ నాలుగు పరీక్షల్లో పాసైన వారిని ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదిస్తే మీకు కావలసిన సమాచారం దొరుకుతుంది.