NLC Recruitment : నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు..!
ప్రధానాంశాలు:
NLC Recruitment : నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
NLC Recruitment : నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ( NLC) 210 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థ/లఉ అధికారిక వెబ్‌సైట్ https://www.nlcindia.in/ ద్వారా 24.10.2024 ఉదయం 10.00 నుంచి 06.11.2024 సాయంత్రం 05.00 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు తప్పనిసరిగా NLC అప్రెంటీస్ 2024 నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి మరియు వారి అర్హతను నిర్ధారించుకోవాలి.
NLC Recruitment వివరాలు
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 181 ఖాళీలు
2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ : 29 ఖాళీలు
మొత్తం ఖాళీల సంఖ్య : 210.
విభాగాలు : ఫార్మసీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, జియాలజీ, కెమిస్ట్రీ, ఎంఎల్‌టీ, ఎక్స్-రే టెక్నీషియన్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్.
శిక్షణ వ్యవధి : ఏడాది.
స్టైపెండ్ : నెలకు బీఫార్మసీ అభ్యర్థులకు రూ.15,028; బీకాం/ బీఎస్సీ/ బీసీఏ/ బీబీఏ/ బీఎస్సీ అభ్యర్థులకు రూ.12,524. టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.12,524.
అర్హతలు : సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఫార్మసీ బీకాం/ బీఎస్సీ/ బీసీఏ/ బీబీఏ/ బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
NLC Recruitment యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,883 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

NLC Recruitment : నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ఎంపిక ప్రక్రియ : డిప్లొమా/ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 24-10-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 06-11-2024.
అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి : 07-12-2024.
జాయినింగ్ తేదీ : 11-12-2024.
ముఖ్యాంశాలు :
= అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది.
– అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.