Anganwadi : అంగ‌న్వాడి ఉద్యోగాల‌కి నోటిఫికేష‌న్… ఎలాంటి ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anganwadi : అంగ‌న్వాడి ఉద్యోగాల‌కి నోటిఫికేష‌న్… ఎలాంటి ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :5 January 2025,7:00 am

Anganwadi : ప్ర‌స్తుతం ఉద్యోగాల కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ప్ర‌భుత్వాలు కూడా ప‌లు నోటిఫికేష‌న్స్ విడుద‌ల చేస్తూ గుడ్ న్యూస్ చెబుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో 116 అంగన్వాడి పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల కాగా, ఇందులో అంగన్వాడి టీచర్, సహాయకురాలు, మినీ టీచర్ ఖాళీలు. ఈ పోస్టులకు ఎంపిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతుంది. దరఖాస్తు ఫారమ్ మరియు నోటిఫికేషన్ వివరాల కోసం https://annamayya.ap.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించండి లేదా క్రింద నోటిఫికేషన్ లింక్ ని క్లిక్ చేసి సమాచారం తెలుసుకొని దరకాస్తు చేసుకోండి…

Anganwadi అంగ‌న్వాడి ఉద్యోగాల‌కి నోటిఫికేష‌న్ ఎలాంటి ఫీజు లేదు ఎగ్జామ్ లేదు

Anganwadi : అంగ‌న్వాడి ఉద్యోగాల‌కి నోటిఫికేష‌న్… ఎలాంటి ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు..!

Anganwadi : మంచి అవ‌కాశం..

పోస్టుల పేరు అంగన్వాడి టీచర్, అంగన్వాడి సహాయకురాలు, మినీ అంగన్వాడి టీచర్, ఖాళీల సంఖ్య చూస్తే.. అంగన్వాడి టీచర్: 11అంగన్వాడి సహాయకురాలు: 93మినీ అంగన్వాడి టీచర్: 12. ఇక విద్యార్హతలు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత. వయోపరిమితి సాధారణ: 21-35 ఏళ్లు SC/ST: 18-35 ఏళ్లు. దరఖాస్తు విధానం అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి, సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుము ఏమి లేదు. ఎంపిక విధానం పాఠశాల విద్య, ప్రీ-స్కూల్ ట్రైనింగ్, మరియు మౌఖిక పరీక్ష ఆధారంగా జ‌రుగుతుంది. ఇక వెబ్‌సైట్ https://annamayya.ap.gov.in/ కాగా, దరఖాస్తు ప్రారంభ తేదీ 24-12-2024, దరఖాస్తు చివరి తేదీ 02-01-2025

ద‌ర‌ఖాస్తు డౌన్ లోడ్ అనేది https://annamayya.ap.gov.in/ వెబ్‌సైట్ నుండి చేసుకోవాలి లేదా క్రింద అప్లికేషన్ ఫారమ్‌ లింక్ ని క్లిక్ చేయండి. అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను జ‌త‌ప‌ర‌చాలి. అవసరమైన ధ్రువపత్రాలు: విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, పుట్టిన తేదీ సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం (వినియోగంలో ఉంటే), నివాస ధ్రువీకరణ పత్రం, ఇతర అవసరమైన పత్రాలు (ప్రజలు పేర్కొన్న పత్రాలు). దరఖాస్తు సమర్పణ: దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలి. రుసుము: ఈ దరఖాస్తు ప్రక్రియకు ఎటువంటి రుసుము అవసరం లేదు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది