నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … SBI లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు..!
ప్రధానాంశాలు:
SBI లో భారీగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు ..ఎలా అప్లై చేసుకోవాలంటే !!
SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి, 12వ తరగతిలో ఇంగ్లీషు సబ్జెక్టుగా ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 2,964 ఖాళీలలో 2,600 రెగ్యులర్ పోస్టులు కాగా, 364 బ్యాక్‌లాగ్ పోస్టులుగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30, 2025. అభ్యర్థులు bank.sbi/web/careers/current-openings ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … SBI లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు..!
SBI : SBI లో భారీగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
ఈ ఉద్యోగాలకు అర్హతగా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు లేదా రీజనల్ రూరల్ బ్యాంక్స్‌లో ఆఫీసర్ స్థాయిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 ఏప్రిల్ 30 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వారి కేటగిరీపై ఆధారపడి 10 నుండి 15 ఏళ్ల వయస్సు మినహాయింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూకు హాజరుకావడం తప్పనిసరి. పరీక్షలో మొత్తం 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇంగ్లీషు, బ్యాంకింగ్ అవేర్‌నెస్, జనరల్ అవేర్‌నెస్, ఎకానమీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అంశాలపై ఉంటాయి. పరీక్షకు 2 గంటల సమయం ఇస్తారు. అదనంగా 30 నిమిషాల డిస్క్రిప్టివ్ సెక్షన్‌లో లెటర్ రైటింగ్ మరియు ఎస్సై రాయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు కనీస వేతనం నెలకు రూ.48,480గా ఉంటుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ వివరాలు, అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి ఆన్లైన్ ద్వారా తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి.