Bank of Baroda : తెలుగు చ‌ద‌వ‌డం, రాయ‌డం వ‌స్తే బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bank of Baroda : తెలుగు చ‌ద‌వ‌డం, రాయ‌డం వ‌స్తే బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగం..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 May 2025,6:00 pm

Bank of Baroda : నిరుద్యోగుల‌కి బ్యాంక్ ఆఫ్ బ‌రోడా తీపి క‌బురు చెప్పింది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పదో తరగతి పాసైన అభ్యర్థులు లేదంటే తక్కువ విద్యార్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఆన్‌లైన్‌ అర్హతలు.. కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలానే స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.

Bank of Baroda తెలుగు చ‌ద‌వ‌డం రాయ‌డం వ‌స్తే బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగం

Bank of Baroda : తెలుగు చ‌ద‌వ‌డం, రాయ‌డం వ‌స్తే బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగం..!

Bank of Baroda ఆల‌స్యం ఎందుకు..

కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. 2025 మే 3 నుంచి 2025 మే 23 వరకు ద‌రఖాస్తు గ‌డువు ఇచ్చార. రాష్ట్రాల వారీగా.. ఆంధ్రప్రదేశ్‌ – 22 పోస్టులు తెలంగాణ – 13 పోస్టులు మిగతా రాష్ట్రాల్లో కూడా పోస్టులు ఉన్నాయి . కనీస వయస్సు: 18 సంవత్సరాలు గరిష్ఠ వయస్సు: 26 సంవత్సరాలు వయస్సు సడలింపు.. ఓబీసీ అభ్యర్థులకు – 3 సంవత్సరాలు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు – 5 సంవత్సరాలు దివ్యాంగులకు – 10 సంవత్సరాలు.

అప్లికేషన్ ఫీజు.. జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ.600 ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ అభ్యర్థులకు: రూ.100 ఎంపిక విధానం.. రాత పరీక్ష స్థానిక భాష పరీక్ష అవసరమైతే ఇంటర్వ్యూను కూడా నిర్వహించవచ్చు .తుది ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ ఒప్పంద విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చదివి, అన్ని అర్హతలు కలిగినట్లయితే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ https://www.bankofbaroda.in

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది