RRB Jobs : రైల్వే లో 18,799 ఉద్యాగాలకు భారీ నోటిఫికేషన్..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 June 2024,8:00 pm

RRB Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే శాఖ ఓ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇటీవల ఆ పోస్టులను భారీగా పెంచుతూ కేంద్ర రైల్వే శాఖ మరో ప్రకటన విడుదల చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

RRB Jobs  : పోస్టులను పెంచుతూ నోటిఫికేషన్…

ఈ ఏడాది ప్రారంభంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే రీజియన్స్ లో ఖాళీగా ఉన్నటువంటి 5,696అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే తాజాగా ఆ ఖాళీలను భారీగా పెంచుతూ మరో ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ప్రకటనలో భాగంగా రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 18,799 ఏఎల్ పి పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆర్ఆర్.బీ భోపాల్ తెలియజేసింది. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి భారతీయ రైల్వే శాఖ అధికారిక వెబ్ సైట్ https://indiarailways.gov.in/ సందర్శించాల్సిందిగా కోరింది.

RRB Jobs : రైల్వే లో 18,799 ఉద్యాగాలకు భారీ నోటిఫికేషన్..!

RRB Jobs : రైల్వే లో 18,799 ఉద్యాగాలకు భారీ నోటిఫికేషన్..!

అయితే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి అనేే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ తో పాటు సంబంధిత విభాగంలో ఐటిఐ లేదా మెకానికల్ , ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మూడు ఏళ్ల డిప్లమా పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి