TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. హైదరాబాద్ తార్నాకలోని నర్సింగ్ కాలేజీలో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఐదు ఖాళీలు భర్తీ చేస్తున్నట్టు TGSRTC పేర్కొన్నది. అర్హులైన వారి నుంచి అప్లికేషన్స్ ఆహ్వాహిస్తుంది టీ జీ ఎస్ ఆర్ టీ సీ. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు TGSRTC ఎం […]
ప్రధానాంశాలు:
TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. హైదరాబాద్ తార్నాకలోని నర్సింగ్ కాలేజీలో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఐదు ఖాళీలు భర్తీ చేస్తున్నట్టు TGSRTC పేర్కొన్నది. అర్హులైన వారి నుంచి అప్లికేషన్స్ ఆహ్వాహిస్తుంది టీ జీ ఎస్ ఆర్ టీ సీ.
కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు TGSRTC ఎం డీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 18న తార్నాకలో కాలేజ్ లోనే వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. అర్హత గల అభ్యర్ధులు పూర్తి వివరాల కోసం 7075009463, 8885027780 ఫోన్ నంబర్లకు కాల్ చేసి మాట్లాడాలని సజ్జనార్ వెల్లడించారు.
TGSRTC లో కొత్త పోస్టులు..
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఎంపికైతే వారికి 50 వేల దాకా జీతం అందిస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కి ఐతే 28 వేలు, ట్యూటర్ కి ఐతే 25 వేలు జీతం అందిస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్ధులు ఈ వెబ్ సైట్ లో చూడాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఆల్రెడీ ఉంది. ఐతే దాని వల్ల సిటీలో రద్దీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు త్వరలోనే డ్రైఅర్, కండక్టర్ రిక్రూట్ మెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.
నిరుద్యోగులకు ఈ సదావకాశాన్ని అభ్యర్ధులు వాడుకోవచ్చు. ఐతే ఈ కాంట్రాక్ట్ పద్దతి ఎంతకాలం ఉంటుంది. దాని వివరాలు అన్నీ కూడా నోటిఫికేషన్ లో పొందుపరుస్తారు. ఐతే అప్లికేషన్ తేదీ ఆఖరితేదీ గమనించి అభ్యర్ధులు అప్లై చేసుకోవాలని సూచిస్తున్నారు.