TGSRTC | హైదరాబాద్‌ బస్సులకు కొత్త హైటెక్ సదుపాయాలు.. గూగుల్ మ్యాప్స్‌ ద్వారా బస్సుల లైవ్‌ లొకేషన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TGSRTC | హైదరాబాద్‌ బస్సులకు కొత్త హైటెక్ సదుపాయాలు.. గూగుల్ మ్యాప్స్‌ ద్వారా బస్సుల లైవ్‌ లొకేషన్

 Authored By sandeep | The Telugu News | Updated on :7 October 2025,6:30 pm

TGSRTC | ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో టీజీఎస్‌ఆర్టీసీ (TSRTC) తాజాగా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇకపై బస్సు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రత్యేక యాప్‌లు చూసే అవసరం లేదు. గూగుల్ మ్యాప్స్‌ లోనే ఆ సమాచారాన్ని సులభంగా చూడొచ్చు.

#image_title

గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తుంది!

ఇప్పటి వరకు ‘గమ్యం’ అనే యాప్‌ ద్వారా బస్సు ఎక్కడ ఉంది? ఎప్పుడు వస్తుంది? అనే సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసింది ఆర్టీసీ. కానీ, ఆ యాప్‌లో కొన్నిరకాల టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌ ద్వారా అదే సేవలను మరింత ఖచ్చితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమైన ఫీచర్లు ఇవే:

బస్సు ఎక్కడ ఉందో లైవ్ లొకేషన్ తెలుసుకునే అవకాశం
బస్సు వచ్చే సమయం, మార్గం ముందుగానే తెలుసుకోవచ్చు
QR కోడ్‌ ఆధారిత డిజిటల్ బస్సు పాస్‌లు, టికెట్ వివరాలు స్మార్ట్‌ఫోన్‌లో
ప్రయాణికులు తమ దిగే స్టాప్‌కి దూరం ఎంత ఉందో కూడా గూగుల్ మ్యాప్స్‌లో చూసుకోవచ్చు

ప్రారంభం ఎప్పటినుంచంటే?

టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు ఇప్పటికే గూగుల్‌కి సంబంధిత డేటా అందించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు వారాల్లోగా హైదరాబాద్‌ నగర బస్సుల లైవ్ సమాచారం గూగుల్ మ్యాప్స్‌లో కనిపించనుంది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ఇతర బస్సులు కూడా ఇందులో చేర్చనున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది