Krishna..ప్రజలతో ఎమ్మెల్యే ‘ముఖాముఖి’

Authored By praveen T | The Telugu News | Updated on : 8 September 2021, 6:49 pm

జిల్లాలోని పెడన పట్టణంలో నియోజకవర్గ శాసన సభ్యుడు జోగి రమేశ్ బుధవారం వైసీపీ కార్యాలయంలో ప్రజలతో ‘ముఖాముఖి’ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేకు తమ సమస్యలపై విన్నవించారు. ఈ క్రమంలోనే ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న శాసన సభ్యుడు జోగి రమేశ్ అప్పటికప్పుడు కొన్ని సమస్యలను పరిష్కరించారు.

ఈ కార్యక్రమం ద్వారా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించారు. అర్జీలను పరిష్కరించాలని శాసన సభ్యుడు వెంటనే ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు చేరవేశారు. పలు సమస్యలపై ఎమ్మెల్యే ఫోన్ ద్వారా అధికారులకు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే ప్రజలు స్థానిక వైసీపీ నాయకులకు తెలపాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చినట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు.

 

praveen T

No bio available for this author.

  1. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  2. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  3. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

  4. "Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొత్త అడుగు.. రాజకీయాల్లో మరో సంచలనం?"

  5. "Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా ?.. వైరల్ అవుతున్న ధనరాజ్ భార్య వ్యాఖ్యలు.."

  6. "Udhayanidhi Stalin : త్రిష వివాదంలో ఉదయనిధికి లీగల్ షాక్.. కేసు నమోదు, తమిళనాడులో రాజకీయ రగడ.."

  7. "Bengaluru : బెంగళూరులో షాకింగ్ ఘటన .. వ్యక్తిగత ఫోటోల లీక్ .. అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లతో మహిళకు నరకం"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp