Medak..అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్: ఎమ్మెల్యే పద్మ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Medak..అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్: ఎమ్మెల్యే పద్మ

 Authored By praveen | The Telugu News | Updated on :8 September 2021,1:37 pm

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా ఉందని మెదక్ శాసన సభ్యురాలు పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని 1,636 నీటి వనరుల్లో రూ.5.33 కోట్లు విలువ చేసే చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కోంటూరు పెద్ద చెరువులో పద్మా దేవేందర్‌రెడ్డి స్థానిక టీఆర్ఎస్ నాయకులు, అధికారులతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువులు బాగుపడ్డాయన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు టీఆర్ఎస్ సర్కారు చేయూతనిస్తున్నదని, అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌‌రెడ్డి వెంట మత్స్య శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది