Medak.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే పద్మ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. జిల్లా కేంద్రమైన మెదక్ సిటీలోని గాంధీ నగర్‌లో భారీ వర్షాలకుగాను ఇళ్లు నీట మునిగాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి మంగళవారం గాంధీనగర్‌లో పర్యటించారు. ఇళ్ల బాధితులతో మాట్లాడి వారిలో మనోధైర్యం నింపారు. బాధిత కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని, అందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మ హామీ ఇచ్చారు. గాంధీ నగర్‌లో అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులను […]
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. జిల్లా కేంద్రమైన మెదక్ సిటీలోని గాంధీ నగర్‌లో భారీ వర్షాలకుగాను ఇళ్లు నీట మునిగాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి మంగళవారం గాంధీనగర్‌లో పర్యటించారు. ఇళ్ల బాధితులతో మాట్లాడి వారిలో మనోధైర్యం నింపారు. బాధిత కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని, అందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మ హామీ ఇచ్చారు. గాంధీ నగర్‌లో అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులు సమన్వయం చేసుకుని ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. నీట మునిగిన ఇళ్లలో ఉండే ప్రజల కోసం పునరావసం కల్పించాలని అదికారులకు చెప్పారు. అధికారులు అప్రత్తంగా వ్యవహరించాలని ప్రజలను ఆదుకోవాలని కోరారు. గాంధీనగర్ వాసులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తగా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పద్మ సూచించారు.