Medak..దండోరా సభను విజయవంతం చేయండి: నర్సారెడ్డి పిలుపు

0
Advertisement

టీఆర్ఎస్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలతో తెలంగాణ ప్రజలు విసుగు చెంది ఉన్నారని కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ పట్టణ కమిటీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తెలిపారు. ఈ నెల 17న గజ్వెల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ‘దళిత గిరిజన దండోరా సభ’ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు సోమవారం పిలుపునిచ్చారు. నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై సభను సక్సెస్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులను టీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్నదని విమర్శించారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పి కేసీఆర్ ఆ మాట మరిచిపోయారని, దళితులకు మూడెకరాల భూమి హామీ అమలుకు నోచుకోలేదని వివరించారు. నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారని చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా తెలంగాణ సర్కారు కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

 

Advertisement