Medak.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్
జిల్లాలో సోమవారం నుంచి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆఫీసును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సంస్థలో పని చేయుటకు బాయ్స్ కావాలని అధికారులు ఆదివారం తెలిపారు. నిరుద్యోగులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో వస్తువులు డెలివరీ చేయడమే వారి విధి. కాగా వేతనం రూ.పది వేలతో పాటు పెట్రోల్, ఇతర అలవెన్సుటు ఉంటాయని పేర్కొన్నారు. అయితే, ఇందుకుగాను సదరు వ్యక్తుల వద్ద డ్రైవింగ్ లెసెన్స్ కంపల్సరీగా ఉండాలని సూచించారు.
డెలివరీ బాయ్‌గా పని చేయాలనుకున్న వారు ఇంకా మరిన్ని వివరాల కోసం 6302327011 నెంబర్‌కు ఫోన్ చేయొచ్చని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డెలివరీ బాయ్‌గా పని చేయడనికి ఎటువంటి ఎక్స్‌పీరియెన్స్ అవసరం లేదని తెలిపారు. ఇకపోతే కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్, ఆ తర్వాత కాలంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోగా, వారిలో కొందరు ప్రస్తుతం ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ వద్ద డెలివరీ బాయ్స్‌గా పని చేస్తుండటం గమనార్హం.