Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : బంగారం కొనాలనుకునే మహిళలకు గుడ్ న్యూస్. ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. నిజానికి గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రస్తుతం బంగారం ధరలు 50 వేల మార్క్ ను దాటేశాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.ఇండియాలో ఇవాళ ఒక గ్రాము బంగారం 22 క్యారెట్ల ధర రూ.4900 కాగా.. నిన్న రూ.4930గా ఉంది. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ.49,000 గా ఉంది.
నిన్న రూ.49,300 గా ఉంది. 24 క్యారెట్ల ధర భారత్ లో 10 గ్రాములకు రూ.53,450 గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49 వేలు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.53,450గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,450 గా ఉంది. 24 క్యారెట్ల ధర రూ.53,950 గా ఉంది. ముంబైలో రూ.49,000, రూ.53,450 గా ఉంది.కోల్ కతాలో రూ.49,000, రూ.53,450 గా ఉంది. బెంగళూరులో రూ.49,000, రూ.53,450 గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే..
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,000, 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,450 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,000గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,450 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,450 గా ఉంది.ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. దేశ వ్యాప్తంగా వెండి ధరలు కూడా తగ్గాయి. ఒక గ్రాము వెండి ధర ప్రస్తుతం రూ.66.60 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.671 గా ఉంది. కిలో వెండి ధర రూ.67,100 గా ఉంది.