Sunstroke : వ‌చ్చే నాలుగు రోజు జాగ్ర‌త్త‌.. మండిపోతున్న ఎండ‌లు.. వ‌డ‌దెబ్బ‌తో ఐదుగురు మృతి | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sunstroke : వ‌చ్చే నాలుగు రోజు జాగ్ర‌త్త‌.. మండిపోతున్న ఎండ‌లు.. వ‌డ‌దెబ్బ‌తో ఐదుగురు మృతి

Sunstroke : వేస‌విలో మ‌నం ఎక్కువ‌గా వింటున్న పేరు వ‌డదెబ్బ‌. సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ వడదెబ్బ కేసులు పెరుగుతుంటాయి. ఎండ వేడిమికి శరీరంలో ద్రవాలు తగ్గి డీహైడ్రేషన్‌ ముప్పు కూడా ఎక్కువే. ఇది చివరికి వడదెబ్బకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో అవయవాలు పనిచేయకపోవడం, మరణం కూడా సంభవించవచ్చు. ఈ సమ్మర్‌లో వడదెబ్బ మరణాల సంఖ్య క్ర‌మంగా పెర‌గ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.తీవ్రమైన ఎండల్లో తిరిగినప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి వేడిగా అనిపించే పరిస్థితిని వడదెబ్బ అంటారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 April 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Sunstroke : వ‌చ్చే నాలుగు రోజు జాగ్ర‌త్త‌.. మండిపోతున్న ఎండ‌లు.. వ‌డ‌దెబ్బ‌తో ఐదుగురు మృతి

Sunstroke : వేస‌విలో మ‌నం ఎక్కువ‌గా వింటున్న పేరు వ‌డదెబ్బ‌. సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ వడదెబ్బ కేసులు పెరుగుతుంటాయి. ఎండ వేడిమికి శరీరంలో ద్రవాలు తగ్గి డీహైడ్రేషన్‌ ముప్పు కూడా ఎక్కువే. ఇది చివరికి వడదెబ్బకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో అవయవాలు పనిచేయకపోవడం, మరణం కూడా సంభవించవచ్చు. ఈ సమ్మర్‌లో వడదెబ్బ మరణాల సంఖ్య క్ర‌మంగా పెర‌గ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.తీవ్రమైన ఎండల్లో తిరిగినప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి వేడిగా అనిపించే పరిస్థితిని వడదెబ్బ అంటారు. ఈ సందర్భంలో చెమట గ్రంధులు పనిచేయడం మానేస్తాయి. అంటే వడదెబ్బ తగిలితే శరీరం చెమట పట్టదు. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత నియంత్రణలోకి రాదు.

Sunstroke :  డుతున్న ఎండ‌లు..

వ‌డ‌దెబ్బ‌ల‌కి ప‌లువురు మృత్యువాత ప‌డుతుండ‌డం కూడా మ‌నం చూస్తూనే ఉన్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జ‌నాలు బ‌య‌టకి రావాలంటే గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల‌లో ఎండ‌లు పెరిగిపోతున్న నేప‌థ్యంలో జ‌నాలు పిట్ట‌ల‌లా ఎగిరిపోతున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఒక్క రోజే సుమారు ఐదుగురు కన్ను మూశారు. ఏప్రిల్ 29న నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అలానే సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మ‌రింత ఎండ‌లు పెరిగిపోవ‌డంతో ఐదుగురు క‌న్నుమూసారు.

Sunstroke వ‌చ్చే నాలుగు రోజు జాగ్ర‌త్త‌ మండిపోతున్న ఎండ‌లు వ‌డ‌దెబ్బ‌తో ఐదుగురు మృతి

Sunstroke : వ‌చ్చే నాలుగు రోజు జాగ్ర‌త్త‌.. మండిపోతున్న ఎండ‌లు.. వ‌డ‌దెబ్బ‌తో ఐదుగురు మృతి

ములుగు జిల్లా బూటారం గ్రామానికి చెందిన రామగిరి ప్రేమలీల(70), కుమురం భీం జిల్లా ఎల్కపల్లి గ్రామానికిచెందిన చౌధరి రవి(23), కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వృద్ధుడు, శంషాబాద్‌లో భిక్షాటన చేస్తూ జీవించే 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి వ‌డ‌దెబ్బ‌తో క‌న్నుమూసారు.అలానే నల్గొండ జిల్లా అజ్మాపురానికి చెందిన కౌషిక్‌(12) అనే బాలుడు కూడా వడదెబ్బతో కాన‌రాని లోకాల‌కి వెళ్లారు. ఇప్పుడు వ‌డ‌దెబ్బ‌తో కొంద‌రు ఆసుప‌త్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణ‌లో రానున్న నాలుగు రోజుల‌లో ఎండ‌లు బాగా పెరిగే అవ‌కాశం ఉంది. మే, 3 వరకు ఎండలు కొనసాగుతాయని అంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది వాతావ‌ర‌ణ శాఖ‌

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది