7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై కీలక ప్రకటన.. భారీగా పెరగనున్న జీతాలు
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. డీఏ పెంపుపై కేంద్రం త్వరలోనే తీపి కబురు చెప్పబోతోంది. నిజానికి జులైలోనే డీఏ పెరగాల్సి ఉంది కానీ.. డీఏ పెంపుపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలల్లో సంవత్సరానికి రెండు సార్లు డీఏ పెరుగుతుంది. కానీ.. ఈ సంవత్సరం జనవరిలో పెరగాల్సిన డీఏ.. మార్చిలో పెరిగింది. జులైలో పెరగాల్సిన డీఏ ఇంకా పెరగలేదు. ఆగస్టు కూడా పూర్తి కావస్తోంది. అందుకే.. డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
అయితే.. త్వరలోనే కేంద్రం డీఏ పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా 3 శాతం డీఏ పెరగనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డీఏ 42 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. డీఏతో పాటు పెన్షన్ ఉద్యోగులకు డీఆర్ కూడా పెరగనుంది. కానీ.. డీఏ, డీఆర్ పై ఇప్పటి వరకు కేంద్రం సరైన స్పష్టత ఇవ్వలేదు. అయితే.. డీఏ ఎప్పుడు పెరిగినా జులై 1, 2023 నుంచే దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అప్పటి నుంచి బకాయిలు ఉద్యోగులకు చెల్లించనున్నారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం 4 శాతం డీఏను డిమాండ్ చేస్తున్నారు. కానీ.. జూన్ 2023 కి సంబంధించిన సీపీఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ ను జులై 31న రిలీజ్ చేశారు. దాని ప్రకారమే డీఏను 3 శాతం వరకే పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే.. ప్రస్తుతం ఉన్న 42 శాతానికి 3 శాతం డీఏ పెరిగితే అది 45 శాతం అవనుంది.
7th Pay Commission : 4 శాతం డీఏ డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు
ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు సీపీఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ ప్రకారం డీఏను లెక్కిస్తారు. పాయింట్స్ ఎన్ని పెరిగితే డీఏ అంత తగ్గుతుంది. పాయింట్స్ ఎన్ని తగ్గితే డీఏ అంత పెరుగుతుంది. అయితే.. త్వరలోనే డీఏ పెంపుపై స్పష్టమైన ప్రకటన వస్తుందట. డీఏ, డీఆర్ పెంపు వల్ల కోటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ సంవత్సరం జనవరికి సంబంధించిన డీఏ మార్చిలో 4 శాతం పెరిగింది. దీంతో 38 శాతం డీఏ నుంచి 42 శాతం అయింది.