7th Pay Commission : ఉద్యోగులకు గుడ్ న్యూస్… ఒకేసారి రెండు బెనిఫిట్స్ అందించనున్న ప్రభుత్వం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

7th Pay Commission : ఉద్యోగులకు గుడ్ న్యూస్… ఒకేసారి రెండు బెనిఫిట్స్ అందించనున్న ప్రభుత్వం..!

 Authored By anusha | The Telugu News | Updated on :9 January 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  7th Pay Commission : ఉద్యోగులకు గుడ్ న్యూస్... ఒకేసారి రెండు బెనిఫిట్స్ అందించనున్న ప్రభుత్వం..!

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాల్లో ఉద్యోగాలు చేసే వారికి అందే ప్రయోజనాలు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డియర్‌నెస్ అలవెన్స్(DA) పెంపు గురించి వార్తలు వస్తుండగా ఇప్పుడు మరో రూపంలో కూడా ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. హౌస్ రెంట్ అలవెన్సు( HRA) లను సైతం కేంద్రం పెంచనున్నట్లు తెలుస్తుంది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు బెనిఫిట్స్ అందించడం పై దృష్టి సారించింది. డియర్ నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ ఈ రెండింటిని పెంచాలని కేంద్రం నిర్ణయించింది.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 46% డీఏ అందుబాటులో ఉంది. అయితే డీఏ ను 4శాతం పెంచే అవకాశం ఉంది. దీని తర్వాత మొత్తం డీఏ ను 50% పెరగనుంది.

అద్దె ఇంట్లో నివసించే ఉద్యోగులు మాత్రమే హెచ్ఆర్ఏ పొందుతారు. అయితే ఇది ఉద్యోగులు పనిచేసే నగరాన్ని బట్టి ఉంటుంది. నిబంధనల ప్రకారం టైర్-2 లేదా టైర్ -3 నగరాల్లో నివసించే ఉద్యోగ కంటే టైర్-1 నగరాల్లో నివసించే ఉద్యోగులకు ఎక్కువ హెచ్ఆర్ఏ అందుతుంది. డీఎ, హెచ్ఆర్ఏ రెండు పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం భారీగా పెరిగే అవకాశం ఉంది. హెచ్ఆర్ఏ ను X, Y, Z అనే మూడు వర్గాలుగా విభజించారు. X కేటగిరీలో 50 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు ఉంటాయి.ఈ నగరాల్లోని ఉద్యోగులు 7వ పే కమిషన్ కింద సెంట్రల్ పే కమిషన్ సిఫార్సు ప్రకారం 24 శాతం హెచ్ఆర్ఏ పొందుతారు. 5 లక్షల నుంచి 50 లక్షల మధ్య జనాభా ఉన్న నగరంY క్యాటగిరి కిందకు వస్తుంది. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ఉద్యోగులు బేసిక్ పే లో 16% హెచ్ఆర్ఏ పొందుతారు. Z సిటీ కేటగిరీలో ఐదు లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న ఉద్యోగులు ఉంటాయి. ఈ కేటగిరిలో ఉద్యోగులు 8 శాతం హెచ్ఆర్ఏ అందుకుంటారు.

డియర్ అలవెన్స్ ను సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అర్థవార్షిక డేటా ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కరెన్సీ విలువ, ఉద్యోగుల కొనుగోలు శక్తిని తగ్గుతాయి. ప్రతి ప్రతికూలతను కవర్ చేసేందుకు డియర్ నెస్ అలవెన్స్ ను పెంచుతారు. జనవరి 1 జూలై 1 నుంచి డిఏ హైక్ అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. గత సంవత్సరంలో డీఏ ను 8శాతం వరకు పెంచారు. ప్రస్తుతం 4 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. కేంద్రం నిర్ణయం తీసుకుంటే 2024 జనవరి నుంచి డిఏ అమల్లోకి వస్తుంది. సాధారణంగా అలవెన్సులు పెంచే నిర్ణయాన్ని మార్చి, సెప్టెంబర్ లో ప్రకటిస్తారు. దీంతో 2024 హోలీ కంటే ముందే డీఏ పెంపు గురించి కేంద్రం ప్రకటించవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది