7th pay commission : ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త… డీఏ, గ్రాట్యుటీ పై భారీ పెంపు…!
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ని కేంద్ర ప్రభుత్వం వీరికి వరసగా డియర్ నెస్, అలవెన్స్ పెంచుకుంటూ పోతుంది. వరుసగా మూడు నాలుగు శాతం పెంచుకుంటూ, ప్రస్తుతం మార్చిలో మాత్రం 50 శాతానికి చేరింది. అయితే డీఏ అనేది 50 శాతానికి పెరిగిన తరుణంలో కొత్త రూల్స్ అనేవి అమలు అవుతాయి. దీనిని బేసిక్ పే లో కలిపేసి, […]
ప్రధానాంశాలు:
7th pay commission : ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త... డీఏ, గ్రాట్యుటీ పై భారీ పెంపు...!
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ని కేంద్ర ప్రభుత్వం వీరికి వరసగా డియర్ నెస్, అలవెన్స్ పెంచుకుంటూ పోతుంది. వరుసగా మూడు నాలుగు శాతం పెంచుకుంటూ, ప్రస్తుతం మార్చిలో మాత్రం 50 శాతానికి చేరింది. అయితే డీఏ అనేది 50 శాతానికి పెరిగిన తరుణంలో కొత్త రూల్స్ అనేవి అమలు అవుతాయి. దీనిని బేసిక్ పే లో కలిపేసి, డీఏ ను మళ్ళీ సున్నా నుండి అమలు చేయడం దీనిలో ఒకటి. ఇంకా 50 శాతానికి డీఏ అనేది చేరితే ఎన్నో బెనిఫిట్స్ ఉద్యోగులకు అందుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే. అద్దె భత్యం. ఇంకా ఇతర అలవెన్సు లు కూడా ఎంతో భారీగా పెరుగుతాయి.
ప్రస్తుతం మరొకసారి ఉద్యోగులు ఎగిరి గంతేసే శుభవార్త చెప్పింది కేంద్రం. వారి రిటైర్మెంట్ గ్రాట్యూటీని కూడా భారీ మొత్తంలో పెంచుతున్నట్లు స్పష్టంగా తెలిపింది. రిటైర్మెంట్ గ్రాట్యూటీ, ఇంకా డెత్ గ్రాట్యూటీ 20 శాతం వరకు పెంచి, గతంలో ఉన్నటువంటి రూ.20 లక్షల నుండి, ప్రస్తుతం రూ.25 లక్షల వరకు పెంచింది. జనవరి 1,2024 నుండి అమలు లోకి వస్తుంది అని తెలిపింది. ఈ తరుణంలో 2024, మే 30న ఒక అధికారిక ప్రకటన చేసింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో డీఏ అనేది నాలుగు శాతం వరకు పెంచి 50 శాతానికి చేర్చింది. దీనినే మార్చి నెలలో ప్రకటించినప్పటికీ జనవరి నుండి అమలులోకి వస్తుంది. ఎప్పుడైనా ఏడాదిలో రెండుసార్లు కేంద్రం డీఏ ను సవరించాల్సి ఉంటుంది. ప్రతిసారి కూడా జనవరి మరియు జూలైలో సవరించాల్సి ఉండగా,ఈసారి మాత్రం మార్చి,సెప్టెంబర్ ప్రకటిస్తుంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూస్తే,ఉద్యోగులు ఏదైనా ఒక సంస్థలో ఐదేళ్లు లేక అంతకన్నా ఎక్కువ కాలం పని చేసినట్లయితే వాళ్లు గ్రాట్యూటీ పొందటానికి అర్హులవుతారు. నిజానికి ఉద్యోగి కంపెనీలో చేరిన ప్రతిసారి కూడా మీ కాస్ట్ టు కంపెనీలో కొంత భాగం గ్రాట్యుటీకి జమ చేస్తారు. ఉద్యోగులు అందరూ కూడా ఈ గ్రాట్యుటీకి పొందటానికి అర్హులే. ఇక ప్రైవేట్ కంపెనీల విషయానికి వస్తే, ఉద్యోగికి వచ్చే బేసిక్ శాలరీలో 4.81% వరకు ఉంటుంది. అనగా ఉద్యోగి సీటీసీ రూ.5 లక్షల గా ఉన్నట్లయితే రూ.24,050 గ్రాట్యూటీ అనేది అందుతుంది. అనగా నెలకు 2000 వరకు గ్రాట్యూటీ అనేది వస్తుంది. ఇక ఉద్యోగి వేతనం డీఏ ఆధారంగా గ్రాట్యూటీ అనేది లెక్కిస్తారు. ఉద్యోగి సంపాదించినటువంటి గ్రాట్యుటీ మొత్తం ఆ ఉద్యోగి సర్వీస్ చేసిన కాలం, చివరిసారిగా వచ్చినటువంటి జీతం ఆధారంగానే నిర్ణయం తీసుకుంటారు. నెలకు 26 రోజులుగా లెక్కించి ఈ గ్రాట్యూటీని చెల్లిస్తారు.