7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 4 శాతం పెంచే అవకాశం..!!
7th Pay Commission : ఇటీవల ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా ఓ వార్తా సంస్థతో మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పింఛన్ దారులకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే కరువు భత్యాన్ని నాలుగు శాతం మేర పెంచే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
దీంతో మూల వేతనంలో డీఏ ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ ఈ మేరకు డీఏ పెంపు ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచనుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తే తాజా డీఏ పెంపు జనవరి ఒకటి 2023 నుంచి అమల్లోకి వస్తుంది.
ప్రస్తుతం కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 38 శాతం కరువు భత్యం పొందుతున్నారు. డీఏకీ సంబంధించి చివర సవరణ సెప్టెంబర్ 28 2022న జరిగింది. ఇది జులై మొదటి తారీకు 2022 నుంచి అమలులోకి రావడం జరిగింది. ప్రతి ఆట రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను సవరిస్తూ ఉంటది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు…డీఏ అందజేయడం జరుగుతుంది.