Crime News : తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న చెల్లిని సొంత అన్న ఏం చేశాడో తెలుసా?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 28, 2022, 8:30 am

Crime News : ఒక ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే ఆ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఆ బాధ కొన్నేళ్ల వరకు అలాగే ఆ ప్యామిలీలో ఉంటుంది. తాజాగా అదే జరిగింది. అసలు ఒక ఫ్యామిలీయే నాశనం అయిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు చనిపోవడంతో సొంత చెల్లిని బాగా చూసుకోవాల్సింది పోయి.. ఆ ప్రబుద్ధుడు ఏం చేశాడో తెలిస్తే అతడిని మీరు చంపేస్తారు.

brother kills sister after thier parents death in uttar pradesh

brother kills sister after thier parents death in uttar pradesh

లక్నోలోని సైర్ పూర్ అనే ఏరియాలో హిమాన్షు.. తన చెల్లి, తల్లిదండ్రులతో నివసించేవాడు. అతడు ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. సంవత్సరం క్రితం హిమాన్షు తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో తన సోదరి శివానీతో కలిసి ఉంటున్నాడు. తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత హిమాన్షు డ్రగ్స్ కు బానిస అయిపోయాడు. రోజూ డ్రగ్స్ తీసుకొని ఇంటికి వచ్చి శివానీతో గొడవ పెట్టుకునేవాడు. అలా.. ఈ నెల 24న కూడా తన సోదరితో గొడవ పెట్టుకున్నాడు.

Crime News : డ్రగ్స్ మత్తులో శివానీని కర్రతో చితకబాదిన హిమాన్షు

డ్రగ్స్ మత్తులో ఉన్న హిమాన్షు.. తన చెల్లి శివానీపై విరుచుకుపడ్డాడు. కర్రతో చితకబాదాడు. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆ శవాన్ని ఏం చేయాలో తెలియక… కిచెన్ లో గొయ్యి తవ్వాడు. అక్కడే పూడ్చిపెట్టాడు. రెండు రోజుల తర్వాత తన చెల్లెలు కనిపించడం లేదంటూ పక్కింటి వారితో చెప్పాడు. కానీ.. హిమాన్షు ప్రవర్తనపై అనుమానం వచ్చిన పక్కింటివారు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హిమాన్షు ఇంటికి వచ్చిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయాన్ని మొత్తం హిమాన్షు చెప్పేశాడు. తన డ్రగ్స్ దారికి అడ్డొస్తుందని ఆ కోపంతోనే తన సోదరిని చంపేశానని. కిచెన్ లో పూడ్చి పెట్టానని చెప్పుకొచ్చాడు హిమాన్షు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హిమాన్షును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp