7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ దమాకా… ఒకేసారి రూ.8 వేలు పెరగనున్న జీతం..!
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది డబుల్ దమాకా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఒకేసారి రెండు బెనిఫిట్స్ రాబోతున్నాయి. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ దమాకాను అందించబోతోంది కేంద్రం. చాలా రోజుల నుంచి ఫిట్ మెంట్ పెంచాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ జులైలో రానున్నట్టు తెలుస్తోంది.
ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై చాలా రోజుల నుంచి నిర్ణయం తీసుకోలేదు కేంద్రం. దానికి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. వచ్చే నెలలోనే దానికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ లో భాగంగా కనీసం రూ.8 వేలు పెరిగే అవకాశం ఉంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం 3.68 శాతం ఫిట్ మెంట్ ను డిమాండ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే కేంద్రం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 3.68 గా ఉంది. ప్రభుత్వం 3.68 శాతానికి ఫిట్ మెంట్ ను పెంచే అవకాశం ఉంటే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం కూడా భారీగానే పెరగనుంది.
7th Pay Commission : 3.68 శాతం ఫిట్ మెంట్ డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు
అలాగే.. డీఏ కూడా రెండోసారి పెరగాలి. దానిపై కూడా కేంద్రం వచ్చే నెలలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత మార్చిలోనే కేంద్రం డీఏను పెంచింది. 4 శాతం డీఏ పెరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా మరో 4 శాతం డీఏ పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డీఏ 42 శాతంగా ఉంది. 4 శాతం పెరిగితే అది 46 శాతం అవుతుంది. ఒకేసారి జులైలో రెండు బెనిఫిట్స్ రానున్నాయి.