Central Govt : రోజు రూ.50 పొదుపు చేసి 3 లక్షల పొందండిలా… కేంద్ర ప్రభుత్వం సరికొత్త స్కీమ్…!
Central Govt : కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పొదుపు పథకాలను ప్రవేశ పెడుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి పథకాలలో గ్రామ సురక్ష యోజన పథకం కూడా ఒకటి. అయితే ఈ పథకం కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు దీని ద్వారా ఆరోగ్య జీవిత బీమా పాలసీ కూడా వర్తిస్తుంది. వాస్తవానికి ఈ పథకాన్ని 1955 లోనే ప్రవేశపెట్టారు. ఈ పథకంలో చేరిన వారికి 80 సంవత్సరాలు నిండిన తర్వాత బోనస్ తో కలిపి మొత్తం డబ్బును చెల్లిస్తారు. ఒకవేళ పాలసీ వ్యవధిలో ఉన్నప్పుడు బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే వారి యొక్క మొత్తం డబ్బును నామినీ లేదా కుటుంబ సభ్యులకు అందించడం జరుగుతుంది.
Central Govt : రుణాలు కూడా పొందవచ్చు…
ఇక ఈ పథకానికి 19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులవుతారు. కావున వారంతా కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇక ఈ పథకంలో ప్రీమియం 3 నెలలు లేదా 6 నెలలు లేదా 1 సంవత్సరానికి చెల్లించవచ్చు. అలాగే దీనిలో 55 ఏళ్లు , 58 ఏళ్ళు , 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించే సౌకర్యం ఉంది. అయితే దీనిలో మీకు నచ్చిన దానిని మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఇదే సందర్భంలో ఈ పథకం ద్వారా మీరు రుణాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ రుణాలను మీరు పాలసీ తీసుకున్న 4 సంవత్సరాలు తర్వాత పొందగలుగుతారు. ఇక ఈ రుణాలపై దాదాపు 10 శాతం వడ్డీ ఉంటుంది.
Central Govt : 30 లక్షలు పొందాలంటే…
ఇక ఈ పథకంలో మీరు రూ.30 లక్షల వరకు పొందాలి అంటే ఎంతవరకు ప్రీమియం చెల్లించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మీరు 19 ఏళ్ల వయసులో 10 లక్షలతో పాలసీ తీసుకుని 55 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించినట్లయితే పాలసీ ముగిసిన తర్వాత మీరు రూ.31.6 లక్షలు అందుకుంటారు. అలాగే 58 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించినట్లయితే రూ.33.4 లక్షలు, 60 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే మెచ్యూరిటీతో కలిపి దాదాపు రూ.34.6 లక్షలు పొందవచ్చన్నమాట. అయితే 55 ఏళ్ల మెచ్యూరిటీలో మీరు నెలకు దాదాపు రూ.1,515 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక రోజుకు 50 రూపాయలు మాత్రమే. ఇక 58 ఏళ్ల ప్రీమియం అయితే రూ.1,466 అలాగే 60 ఏళ్ల ప్రీమియం అయితే రూ.1,411 చెల్లించాలి.