Chandrababu : ఢిల్లీ నుండి చంద్రబాబుకు పిలుపు.. ఒక్క దెబ్బకు దిగివచ్చిన నరేంద్ర మోడీ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : ఢిల్లీ నుండి చంద్రబాబుకు పిలుపు.. ఒక్క దెబ్బకు దిగివచ్చిన నరేంద్ర మోడీ…!

Chandrababu : ఏపీ ఎన్నికల్లో జనసేన మరియు టీడీపీ పోత్తులో భాగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వీరితో పాటు బీజేపీ పార్టీని కూడా కూటమిలో చేర్చుకోవాలని ఉద్దేశంతో చాలా కాలంగా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అమిత్ షా మరియు మోడీలతో కూడా చర్చించడం జరిగింది. అయినప్పటికీ బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ కాని ఎక్కడ కూడా కూటమితో కలిసే […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 February 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : ఢిల్లీ నుండి చంద్రబాబుకు పిలుపు.. ఒక్క దెబ్బకు దిగివచ్చిన నరేంద్ర మోడీ...!

Chandrababu : ఏపీ ఎన్నికల్లో జనసేన మరియు టీడీపీ పోత్తులో భాగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వీరితో పాటు బీజేపీ పార్టీని కూడా కూటమిలో చేర్చుకోవాలని ఉద్దేశంతో చాలా కాలంగా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అమిత్ షా మరియు మోడీలతో కూడా చర్చించడం జరిగింది. అయినప్పటికీ బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ కాని ఎక్కడ కూడా కూటమితో కలిసే పరిస్థితి కనిపించడం లేదు. అయితే నరేంద్ర మోడీ లేకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందుకు వెళ్లలేరా అంటే వెళ్లవచ్చు కానీ తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని నిష్పక్షపాతంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలను జగన్మోహన్ రెడ్డి జరగనివ్వడు అనే ఆలోచనలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉండిపోయారు.అందుకే కచ్చితంగా నరేంద్ర మోడీ యొక్క సపోర్ట్ తో వెళ్తేనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ చాలా జాగ్రత్తగా నిర్వహిస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు. అలాగే అధికారంలోకి వస్తే తర్వాత మోడీ యొక్క సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు.అంతేకాక చంద్రబాబు నాయుడు పై ప్రస్తుతం చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. ఓటుకు నోటు స్కిల్ డెవలప్మెంట్ కేసు లో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే ఇవన్నీ కూడా చెదిరిపోవాలి అంటే కచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఆలోచన.

ఇదే రకంగా పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించిన బీజెపీ పార్టీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో వీరికి విపరీతమైన చిరాకు వచ్చిందని చెప్పాలి. దీంతో తాజాగా జనసేన మరియు టీడీపీ పార్టీ వారి ఫస్ట్ జాబితాను విడుదల చేయడం జరిగింది. అయితే మొదటి జాబితాలో 10 లేదా 12 పేర్లను పెట్టి ఉంటే బీజేపీ పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ అలా కాకుండా టీడీపీ ఒకేసారి 94 పేర్లు విడుదల చేసింది. అదేవిధంగా జనసేన 5 పేర్లను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ విధంగా కాస్త బీజేపీని భయపెట్టే ప్రయత్నం కూటమి చేసిందని చెప్పాలి.అంటే మీరు లేకపోయినా సరే మేము ముందుకు వెళ్లగలము అనే విషయాన్ని బీజెపీకి తెలియజేసేలా ఒక చిన్న ప్రయత్నం చేశారు . అయితే ఈ లిస్టు విడుదల చేసిన తర్వాత మీడియా రాజకీయాలలో అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు బీజెపీ పార్టీ దిగివచ్చిందని తెలుస్తోంది.అంతేకాక ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ మరియు జనసేనతో కలిసి పొత్తు కోసం చంద్రబాబు నాయుడుని ఢిల్లీకి పిలిపిస్తున్నట్లుగా సమాచారం.

అయితే నిజంగా ఇది వర్క్ అయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తే పొత్తు విషయంలో కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే కూటమి మొదటి జాబితాను విడుదల చేసింది నరేంద్ర మోడీ నుండి ఈ విధంగా ఫోన్ కాల్ రావడం కోసమే అని పలువురు అంటున్నారు. బీజెపీ నరేంద్ర మోడీ నుండి ఈ రకమైనటువంటి కన్ఫర్మేషన్ కోసమే చంద్రబాబు నాయుడు ఈ వ్యూహాన్ని అమలుపరిచినట్లుగా తెలుస్తోంది. అయితే నిజానికి వైసీపీ పార్టీ మాదిరిగా మొదటి జాబితాలో 20 పేర్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు బీజెపీ దిగివచ్చేది కాదు. అందుకే ఒక వ్యూహం ప్రకారం ఒకేసారి మొదటి జాబితాలో 94 పేర్లను విడుదల చేసి డైరెక్ట్ గా బీజెపీ వచ్చి పోతులో కలుస్తాము అనే విధంగా ప్లాన్ అమలుపరచారని చెప్పాలి.మరి ఇప్పుడు బీజెపీ మరియు టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మేషన్ జరుగుతుందో లేదో వేచి చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది