BBC : ఢిల్లీ బీబీసీ ఆఫీస్ లో ప్రభుత్వ అధికారులు సోదాలు..!
BBC : 2002వ సంవత్సరం గుజరాత్ లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలను ఇటీవల బీబీసీ డాక్యుమెంటరీ రూపంలో రూపొందించడం తెలిసిందే. ఇండియా ది మోడీ క్యూస్షన్ పేరిట రూపొందించిన ఈ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడం జరిగింది. రెండు ఎపిసోడ్ లుగా మోడీ పై ఈ డాక్యుమెంటరీనీ బీబీసీ ప్రసారం చేయడం జరిగింది.
డాక్యుమెంటరీలో అంశాలను కేంద్రం ఖండించడం జరిగింది. ఇదే సమయంలో తనపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ విషయంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. భారత అభివృద్ధి చూసి తట్టుకోలేక కొందరు దేశంలో విభజన సృష్టించడానికి ఈ రీతిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. కానీ అటువంటి ప్రయత్నాలు ఇండియాలో కచ్చితంగా విఫలం అవుతాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పరిస్థితి ఇలా ఉంటే ఈరోజు ఢిల్లీలో బీబీసీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బీబీసీ కార్యాలయంలో ప్రతి చోట క్షుణ్ణంగా సోదాలు నిర్వహించటం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వ బలగాలు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి ఈ పరిణామంపై బీబీసీ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.