Diwali : పండుగ రోజున గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా.. జాతీయ సెలవు దినంగా దీపావళి.. !
Diwali : అగ్రరాజ్యం అమెరికా దీపావళి సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పేసేందుకు సిద్ధమైంది. హిందువుల పండుగ అయిన దీపావళిని నేషనల్ హాలీ డే గా ప్రకటించేలా అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
Diwali : సంతోషం వ్యక్తం చేసిన చట్ట సభ సభ్యులు..
న్యూయార్క్‌కు చెందిన కరోలిన్ బి మలోని నేతృత్వంలోని చట్టసభ సభ్యులు ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మలోని మాట్లాడుతూ దీపావళిని నేషనల్ హాలీడేగా అనౌన్స్ చేసే యాక్ట్‌ను కాంగ్రెస్‌లోని భారత సంతతి సభ్యులతో కూలిసి రూపొందించి అనౌన్స్ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. దీపావళి డే యాక్ట్‌ను ప్రవేశపెడుతున్నందుకు గాను చాలా సంతోషిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చరిత్రాత్మక చట్టానికి భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తితో పాటు ఇతర చట్ట సభసభ్యులు మద్దతు తెలిపారు. దీపావళి ప్రాముఖ్యతను గుర్తించి.. కాంగ్రెస్‌లో తీర్మానం కూడా పెట్టారు. చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటామని, తన సహచరులు భారత సంతతి సభ్యులతో కలిసి భయంకరమైన కొవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దీపావళిని నేషనల్ హాలీ డేగా మార్చడానికి ఇంతకు మించిన మరొక టైం లేదని తాను నమ్ముతున్నానని మలోని పేర్కొన్నారు.
అమెరికా ప్రతినిధుల సభలో విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ గ్రొగరీ మీక్స్ కూడా దీపావళి డే యాక్ట్ బిల్లుకు మద్దతు తెలిపాడు. చీకటిపై వెలుగు కోసం రూపొందించబడిన ఈ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నాడు. ఇకపోతే భారత సంతతి చట్ట సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ దీపావళి ప్రపంచంలో చూడాలనుకునే కాంతి దీపావళి పర్వదినం రోజున లభిస్తుందని ఆశిస్తున్నానని, నిస్సహాయులకు ఆశలు కలిగించే సమాజంలో వెలుగుగా ఉందామని, దీపావళి అంటే అదేనని అన్నారు. ఈ సందర్భంలోనే దీపావళికి జాతీయ సెలవు దినం కావాలని రాజాకృష్ణమూర్తి చెప్పాడు. ఈ సంగతులు పక్కనబెడితే.. దీపావళి పర్వదినం సందర్భంగా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. బాణాసంచాలు, టపాసులు పేల్చేందుకుగాను పిల్లలతో పాటు పెద్దలు కూడా రెడీ అవుతున్నారు.