Britishers : భారతీయుల కోసం బ్రిటీషర్స్ చేసిన ఐదు మంచి పనులు ఏంటో తెలుసా..??
Britishers : దాదాపు 200 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలించడం తెలిసిందే. వర్తక వ్యాపారం అంటూ భారతదేశంలో అడుగుపెట్టిన బ్రిటీషర్స్ ఒక్కసారిగా భారత్ నీ తమ ఆధీనంలో తీసుకొని.. మొగల్ రాజవంశీయులు ఇంకా రకరకాల… రాజవంశాలపై యుద్ధం చేసి భారతీయులపై పెత్తనం చెలాయించారు. దాదాపు రెండు సంవత్సరాల కాలం పాటు బ్రిటీషర్స్ పరిపాలించడం జరిగింది. ఈ క్రమంలో బ్రిటిషర్స్ పాలించిన సమయంలో… భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. దేశంలో ఎన్నో కట్టడాలు.. బ్రిడ్జిలు నిర్మాణం జరుపుకున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఇప్పటికి పేరొందిన భారతీయ రైల్వే వ్యవస్థ.. ఆనాడు బ్రిటీషర్స్ పాలనలోనే స్థాపనకు పునాది పడింది.
భారత ఆర్థిక ఖజానాకు వెన్నెముక రైల్వే అని అందరికీ తెలుసు. భారతదేశంలో రైల్వే వ్యవస్థ తీసుకురావటంలో అభివృద్ధి చేయటంలో బ్రిటిషర్స్ ముఖ్య పాత్ర పోషించారు. ఇక ఇండియాలో ఆంగ్ల భాష కూడా బ్రిటీషర్స్ వారి వల్లే చాలామంది నేర్చుకోవడం జరిగింది. అప్పటిదాకా భారతీయ సంస్కృతిలో భాగంగా కొన్ని వర్గాలు మాత్రమే చదువుకునే పరిస్థితి ఉంటే. బ్రిటీషర్స్ పాలనలో పరిపాలన సౌలభ్యం కోసం ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి నేర్చుకునే రీతిలో పరిస్థితులు కల్పించారు. దీంతో భారతీయులలో జ్ఞానాన్ని మరియు ఆలోచన విధానాన్ని మెరుగుపరచడంలో ఇంగ్లీష్ భాష ఎంతో సహాయపడింది. ప్రపంచంలో నాలుగో అత్యంత శక్తివంతమైన సైన్యం ఇండియన్ ఆర్మీ.
ఇది కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధ్వర్యంలోనే… పునాదిపడి..అత్యంత శక్తివంతమైన ఆర్మీగా ఇప్పటికీ భారత్ ఆర్మీకి పేరు ఉంది. ఇక ఆ తర్వాత భారతదేశంలో టీకాలు కూడా అభివృద్ధి పరచటంలో అప్పటి బ్రిటిషర్స్ పోషించిన పాత్ర వల్లే ఇప్పటికీ ప్రపంచానికే టీకాలు సప్లై చేయటంలో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తుందట. ప్రపంచంలో అనేక ప్రమాదకరమైన వ్యాధులకు భారత్ ద్వారా అందించిన టీకాల వల్లే చెక్ పెట్టడం జరిగిందట. ఈ రకంగా బ్రిటీషర్స్ భారతదేశానికి ఎన్నో అద్భుతమైన మేలులు.. మరిచిపోని అభివృద్ధి పనులు చేయటం జరిగిందంట.