Rice Ban : అమెరికాలో తెలుగోడికి బియ్యం సంక్షోభానికి కార‌ణం ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rice Ban : అమెరికాలో తెలుగోడికి బియ్యం సంక్షోభానికి కార‌ణం ఇదే..!

 Authored By kranthi | The Telugu News | Updated on :22 July 2023,4:00 pm

Rice Ban : విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన విషయం తెలుసు కదా. ఆ ఎఫెక్ట్ ప్రస్తుతం యూఎస్ మీద పడింది. అవును.. ఇటీవలే భారత ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయంతో యూఎస్ లో ఒక్కసారి బియ్యం సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా తెలుగువాళ్లు అయితే బియ్యం ఎక్కడ దొరకవో అని స్టోర్లకు క్యూ కట్టేశారు. ఒక్కొక్కరు 10 బస్తాలు, 20 బస్తాల బియ్యాన్ని కొనుక్కొని తీసుకెళ్తున్నారు. దీంతో స్టోర్ల ముందు ఎక్కడ చూసినా ఇండియన్సే కనిపిస్తున్నారు.బియ్యం కోసం ఇండియన్స్ స్టోర్ల ముందు క్యూ కడుతున్నారు. అందులో ఎక్కువగా తెలుగువాళ్లే ఉండటం గమనార్హం. దానికి కారణం.. తెలుగువాళ్లు ఎక్కువగా రైస్ తింటారు. వాళ్లకు అన్నం లేకుంటే ముద్ద దిగదు.

అందుకే.. బియ్యం స్టాక్ అయిపోతే బియ్యం సంక్షోభం ఎక్కడ ఏర్పడుతుందో అని స్టోర్ల ముందు క్యూ కడుతున్నారు. భారత్ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిందనే విషయం తెలియగానే పోటీ పడి మరీ బస్తాలకు బస్తాలు కొనుక్కెళ్తున్నారు.ఇక.. బియ్యానికి డిమాండ్ పెరగడంతో కొన్ని బియ్యం స్టోర్ల ముందు నో స్టాక్స్ బోర్డ్స్ పెట్టారు. ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. సోనా మసూరి బియ్యానికి యూఎస్ లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఆ బియ్యం అస్సలు దొరకడం లేదు. డబ్బులు ఎక్కువ పెట్టి కొందామన్నా దొరకడం లేదు. స్టోర్లు, మార్టులు ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే. నిజానికి.. బియ్యం ఎక్కువగా పండేది మన దగ్గరే.

fighting over rice bags in america after rice export ban

fighting over rice bags in america after rice export ban

ఇప్పటికే కొన్ని బియ్యం స్టోర్స్ ముందు నో స్టాక్స్ బోర్డ్స్

ప్రపంచం మొత్తానికి బియ్యం సరఫరా చేసే దేశాల్లో 45 శాతం వాటా భారత్ దే. మన దేశం నుంచి బియ్యం.. చాలా దేశాలను ఎగుమతి అవుతుంది. అందులో యూఎస్ కూడా ఒకటి. అక్కడ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి బియ్యం ఎక్కువగా అక్కడికి ఎగుమతి అవుతూ ఉంటుంది. అయితే.. మన దగ్గర ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండేందుకు బియ్యం ఎగుమతులను కేంద్రం నిలిపివేసింది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు అమెరికాలో కనిపిస్తోంది. అక్కడ స్టోర్ల వద్ద ఇండియన్స్ హడావుడి కనిపిస్తోంది. దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది