Good News : గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఉపాధి కూలీల వేతనాలు పెంపు..!
ప్రధానాంశాలు:
Good News : గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఉపాధి కూలీల వేతనాలు పెంపు..!
Good News : ప్రజల సంక్షేమాన్ని, వారి ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్నో రకాల పథకాలను తీసుకువస్తోంది భారతదేశంలోని అన్ని ప్రాంతాలు ఒకే విధంగా ఉండవు. కొన్ని చోట్ల కరువు కాటకాలు కూడా ఉంటాయి. అందుకే ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు పని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలను తీసుకువచ్చి వారిని ఆదుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా వేసవి కాలంలో పల్లెటూరు జనాలకు పని కల్పించేందుకు చాలా రకాల పథకాలను తీసుకువచ్చింది.
ఇందులో భాగంగానే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఉపాధి లభిస్తోంది. అర్హులైన వారందరికీ వంద రోజుల ఉపాధి దీని ద్వారా లభిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఉపాధి కూలీలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే పలు మార్లు వేతనాల పెంపు గురించి ఏదో ఒక న్యూస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే ఉపాధి కూలీల వేతనాలను పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న సంగతి తెలిసిందే.
ఎన్నికల కోడ్ ఉన్నందున కూలీల వేతనాల పెంపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు కేంద్రం ఈ విషయంపై ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని ప్రభుత్వం తీసుకున్నట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. ఎన్నికల సంఘం అనుమతి చెప్పడంతో ఏప్రిల్ 1 నుంచి వేతనాలు పెరగబోతున్నాయి. అయితే ఈ పథకం లో భాగంగా పెంచిన వేతనాలను ఎన్నికల్లో ప్రచారం చేసుకోవద్దని ఈసీ కోరింది. 2005లో అప్పటి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీ విధానాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.