Indian Railways : గుడ్ న్యూస్… రైల్లో కూడా టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు…!
ప్రధానాంశాలు:
Indian Railways : గుడ్ న్యూస్... రైల్లో కూడా టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు...!
Indian Railways : ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేరుస్తోంది ఇండియన్ రైల్వేస్.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వరకు చవకైన ప్రయాణాన్ని ప్రజలకు అందిస్తూ రైల్వే శాఖ ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ప్రభుత్వ సంస్థగా గుర్తింపు పొందిన సంగతి అందరికీ తెలిసిందే.. ఎప్పటికప్పుడు సరికొత్త సేవలతో అందిస్తూ ప్రయాణికులకు పెద్దపీట వేస్తూ దూసుకుపోతోంది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. కొందరు అకస్మాత్తుగా రిజర్వేషన్ టికెట్ దొరకపోవచ్చు.. అయినా ఏం పర్వాలేదు. రిజర్వేషన్ టికెట్ లేకుండా ప్యాసింజర్స్ వారి గమ్యస్థానానికి ఇలా ప్రయాణించవచ్చు.. ప్యాసింజర్ తన దగ్గర టికెట్ లేదని కంగారు పడవలసిన అవసరం లేదు.
అటువంటి పరిస్థితుల్లో సదరు ప్రయాణికులు ప్లాట్ ఫామ్ టికెట్ తో రైల్లో ప్రయాణించవచ్చు.. అయితే మీరు వెంటనే టికెట్ కలెక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది. మీ గమ్యస్థానానికి అతనికి చెప్పి అందుకు తగ్గ డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా టికెట్ను తీసుకొని ప్రశాంతంగా ప్రయాణించవచ్చు.. రిజర్వేషన్ లేకుండా ప్లాట్ ప్లాట్ ఫామ్ టికెట్ ప్యాసింజర్ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. రైల్లో రద్దీ కారణంగా ఒక బెర్తు మాత్రమే కాదు.. సీటు కూడా ఖాళీ లేని సందర్భాలు బోలెడు ఉంటాయి. అటువంటి సమయంలో టిటి రిజర్వ్ సీటు ఇవ్వలేకపోవచ్చు.. కానీ ప్యాసింజర్ ప్రయాణాన్ని మాత్రం ఆపలేరు.
అటువంటి సమయంలో మీరు నిబంధనలు ప్రకారం రిజర్వ్ బోగీలో ప్రయాణించాలనుకుంటే మీరు ముందుగా టికెట్లు కొనకపోతే అప్పుడు 250 రూపాయలు అపరాధ రుసుముతో పాటు ప్రయాణానికి సంబంధించిన మొత్తం చార్జిని చెల్లించాలి. ఆపై టీటీ నుంచి సంబంధిత టికెట్ను తీసుకోవాలి… అప్పుడు మీకు ఖాళీ లేదా సీట్లను చూపిస్తారు.. ఈ విధంగా మీరు చేతిలో టికెట్ లేకపోయినా ఇకనుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఈ విధంగా మీరు టికెట్ లేకుండా కూడా ప్రయాణించవచ్చు..