Moon : ఇటీవల చంద్రాయన్-3 ప్రాజెక్టు సక్సెస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ ధ్రువం పై మొట్టమొదటిసారి అడుగుపెట్టిన దేశంగా భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఇప్పుడు చంద్రుడి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రునిపై భూములు మరియు ఫ్లాట్లు కొంతమంది సెలబ్రిటీలు కొనుక్కున్నట్లు అప్పట్లో వార్తలు రావడం తెలిసిందే. అంతేకాదు భూమి మీద కంటే చంద్రునిపై తక్కువ ధరకు ఫ్లాట్ లు కొనుగోలు చేయవచ్చన్నట్లు ప్రచారం జరిగింది.
అయితే ఇది నిజంగా సాధ్యమేనా? చంద్రునిపై భూమి కొనవచ్చా? వాస్తవ తనిఖీ వెబ్‌సైట్‌లు, రక్షణ, ఏరోస్పేస్ నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మూన్ ల్యాండ్ లో భూమి మరియు ఫ్లాట్లు కొనుగోలు అనేది అసాధ్యమని డిఫెన్స్, ఏరోస్పేస్ నిపుణుడు గిరీష్ లింగన్న స్పష్టం చేయడం జరిగింది. చంద్రునితో సహా బాహ్య అంతరిక్షాన్ని ఎవరు కొనుగోలు చేయలేరని.. ఎవరికి దక్కదని పేర్కొన్నారు. అసలు యజమాని లేనప్పుడు భూమిని ఎలా అమ్ముతారు అని క్లారిటీ ఇచ్చారు. 1967లో అమల్లోకి వచ్చిన ఒప్పందం అందరికీ ఉమ్మడి వారసత్వం అని స్పష్టం చేశారు.
అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో దివంగత సుశాంత్ సింగ్ చంద్రునిపై కొంత స్థలం కొనుగోలు చేసినట్లు దానికి మెర్ ముస్కోవియన్స్ లేదా సీ ఆఫ్ మస్కోవి అని పిలుచుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిలో వాస్తవం లేదని.. చంద్రునిపై కొనే హక్కు ఎవరికీ లేదని దానికి యజమాని లేడని.. అలాంటప్పుడు అమ్మడం కొనడం అసాధ్యం అంటూ డిఫెన్స్, ఏరోస్పేస్ నిపుణుడు గిరీష్ లింగన్న స్పష్టం చేశారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.